OTT | సినీ ప్రేక్ష‌కుల‌కి పండ‌గే.. ఈ వారం థియేట‌ర్, ఓటీటీల‌లో ఎన్ని మూవీస్ రానున్నాయంటే..!

OTT: ప్ర‌తి వారం ఇటు ఓటీటీలోనో లేదంటే థియేట‌ర్‌లోనో ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా దొర‌కుతుంది. చిన్న సినిమాలు లేదంటే పెద్ద సినిమాలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తుండ‌డం, ఓటీటీలోను మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డం జ‌రుగుతుంది. ఈ వారం కొన్ని క్రేజీ సినిమాల‌తో పాటు ఓటీటీ కంటెంట్ సినీ ప్రియుల‌ని మెప్పించేందుకు సిద్ధ‌మైంది. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నదియా, యోగిబాబు ప్ర‌ధాన పాత్రల్లో ఎం.ఎస్.ధోని నిర్మాణంలో రూపొందిన ఎల్.జీ.ఎం చిత్రం ఆగష్టు 4వ […]

  • By: sn    latest    Aug 01, 2023 6:25 PM IST
OTT | సినీ ప్రేక్ష‌కుల‌కి పండ‌గే.. ఈ వారం థియేట‌ర్, ఓటీటీల‌లో ఎన్ని మూవీస్ రానున్నాయంటే..!

OTT: ప్ర‌తి వారం ఇటు ఓటీటీలోనో లేదంటే థియేట‌ర్‌లోనో ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా దొర‌కుతుంది. చిన్న సినిమాలు లేదంటే పెద్ద సినిమాలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తుండ‌డం, ఓటీటీలోను మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డం జ‌రుగుతుంది. ఈ వారం కొన్ని క్రేజీ సినిమాల‌తో పాటు ఓటీటీ కంటెంట్ సినీ ప్రియుల‌ని మెప్పించేందుకు సిద్ధ‌మైంది. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నదియా, యోగిబాబు ప్ర‌ధాన పాత్రల్లో ఎం.ఎస్.ధోని నిర్మాణంలో రూపొందిన ఎల్.జీ.ఎం చిత్రం ఆగష్టు 4వ తేదీన తెలుగులో థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

అభినవ్ సర్దార్ హీరోగా తెరకెక్కిన సర్దార్ మూవీ కూడా ఆగ‌స్ట్ 4న థియేట‌ర్స్‌లోకి రానుంది. శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’ సినిమాని ఆగస్టు 4న థియేటర్‌లలో విడుద‌ల చేయ‌నున్నారు. విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ కూడా ఆగ‌స్ట్ 4న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే నెట్ ఫ్లిక్స్ లో నాగ‌శౌర్య‌, యుక్తి త‌రేజా జంట‌గా వ‌చ్చిన రంగ‌బ‌లి జూలై7న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాగా, ఆగ‌స్ట్ 4 నుండి స్ట్రీమ్ కానుంది. సోల్‌క్యాచ‌ర్ (పోలాండ్ మూవీ)), మార్క్ కావెండీష్ నెవ‌ర్ ఎన‌ఫ్ (హాలీవుడ్ మూవీ), పాయిజ‌న్‌డ్ ది డ‌ర్టీ ట్రూత్ ఎబౌట్ యువ‌ర్ ఫుడ్ (హాలీవుడ్ మూవీ), జామ్ 100 (జ‌ప‌నీస్ మూవీ), చూనా (వెబ్‌సిరీస్‌), హెడ్ టూ హెడ్ (అర‌బిక్ సిరీస్‌), ది లింక‌న్ లాయ‌ర్ సీజ‌న్ 2, ఫెట‌ల్ సెడాక్ష‌న్ వాల్యూమ్ 2, ది హంట్ ఫ‌ర్ వీర‌ప్ప‌న్ (హిందీ) స్ట్రీమ్ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఎరుంబు (త‌మిళ్ మూవీ), పెయింట్ (హాలీవుడ్ మూవీ), ది లాస్ట్ ఫ్ల‌వ‌ర్స్ ఆఫ్ ఎలైస్ హార్ట్ స్ట్రీమ్ కానున్నాయి. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ లో ద‌యా వెబ్‌సిరీస్ ఆగ‌స్ట్ 4న రిలీజ్ కానుంది. గార్డియ‌న్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 కూడా ఇందులో స్ట్రీమ్ కానుంది. సోనిలివ్‌లో పరేషాన్, ఫ‌తాఫ‌తి (బెంగాలీ మూవీ), మోరిబ‌స్ (హాలీవుడ్ మూవీ) స్ట్రీమింగ్ కానున్నాయి. ల‌య‌న్స్ గేట్ ప్లే లో డెవిల్స్ వ‌ర్క్‌షాప్ (హాలీవుడ్ మూవీ), సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్ (హాలీవుడ్ మూవీ)లు స్ట్రీమింగ్ కానున్నాయి.