పాకిస్తాన్: రూ.210కి చేరిన లీటర్ పాల ధర.. అల్లాడుతున్న జనం
Pakistan Crisis | దాయాది దేశంల పాక్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. ఫలితంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య కరాచీలో పాల ధర భారీగా పెరిగింది. లీటర్ పాల ధర రూ.210కి పెరిగింది. లీటర్ పాలు కొనుగోలు చేసేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తుందని, పిల్లలు సైతం పాలు దొరక్క ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చికెన్ ధర కిలోకు రూ.780వరకు చేరింది. మరో […]

Pakistan Crisis | దాయాది దేశంల పాక్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. ఫలితంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య కరాచీలో పాల ధర భారీగా పెరిగింది.
లీటర్ పాల ధర రూ.210కి పెరిగింది. లీటర్ పాలు కొనుగోలు చేసేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తుందని, పిల్లలు సైతం పాలు దొరక్క ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చికెన్ ధర కిలోకు రూ.780వరకు చేరింది. మరో వైపు దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా పడిపోతున్నాయి.
ప్రస్తుతం మూడు బిలియన్ల కంటే తక్కువగానే ఉన్నాయి. మరో వైపు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. వారిపై మరింత భారం పడబోతున్నది. రుణం కోసం ఐఎంఎఫ్ నిర్ధేశించిన షరతులతో ఈ కష్టాలు పెరుగనున్నాయి. రుణం కోసం సబ్సిడీలు తగ్గించాలని ఐఎంఎఫ్ సూచించింది.
జీఎస్టీ పెంపు, పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో రక్షణ బడ్జెట్‌లో 10-15 శాతం వరకు కోత పెట్టాలని ఐఎంఎఫ్ షరతులపై ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖతో చర్చించింది. యుద్ధేతర బడ్జెట్‌లో కేవలం 5-10 శాతం మాత్రమే కోత విధించాలనే ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్ సూచనపై రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది.