India-Pakistan: గంటల యుద్దానికే పాకిస్తాన్ గడబిడ!

బంకర్ లోకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
అజ్ఞాతంలోకి ఆర్మీ చీఫ్
అప్పు కోసం ఐఎంఎఫ్ వద్ధకు పరుగు
India-Pakistan: భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0లో భాగంగా చేపట్టిన మిలటరీ దాడులలో పాకిస్తాన్ దేశం అతలాకుతలమవుతుంది. పాకిస్తాన్ గురువారం రాత్రి 13ప్రాంతాల్లో భారత్ పై డ్రోన్లు, మిస్సైల్స్ లతో దాడికి పాల్పడింది. వాటన్నింటిని భారత్ ఆర్మీ ఎస్ 400డిఫెన్స్ వ్యవస్థతో మార్గమధ్యలోనే అడ్డుకుని కూల్చివేసింది. జమ్మూ, ఉధంపుర్, అఖ్నూర్, పూంఛ్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ ఎస్ పురాలో మిస్సైల్స్ దాడి చేసింది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. 50డ్రోన్లను పాకిస్తాన్ కూల్చివేసింది. మరో 3ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది. భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన డ్రోన్లను, క్షిపణలను కూల్చడంలో రష్యా తయారీ సుదర్శన చక్రం ఎస్ 400డిఫెన్స్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ద నౌక నుంచి కూడా కరాచీ పోర్ట్‌పై భారత్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగించింది. ఏయిర్ ఫోర్స్, నేవి దాడులతో పాటు సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట పాక్ సైనిక పోస్టులను భారత సైనిక దళాలు ధ్వంసం చేశాయి. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లతో పాక్ మిలిటరీ పోస్ట్‌లను ధ్వంసం చేసింది.
సురక్షిత ప్రదేశానికి పాక్ ప్రధాని..అజ్ఞాతంలోకి ఆర్మీ చీఫ్
భారత్ జరిపిన డ్రోన్ లు, మిస్సైల్ దాడులతో ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని నివాసానికి అతి సమీపంలో మిస్సైల్ పడింది. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం.
భారత్ దెబ్బకు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
భారత్ దాడులతో పాకిస్తాన్ ఆర్థికంగా భారీ నష్టాలకు గురైందని పాక్ వర్గాల కథనం. ఇందుకు ఉదాహారణగా తాము భారత్ తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని..మా దేశానికి మరిన్ని లోన్లు ఇవ్వాలని పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను కోరడం వైరల్ గా మారింది. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని పాకిస్తాన్ ఆర్థిక శాఖ చేసిన ట్వీట్ ఆ దేశ దీన స్థితిని చాటుతుంది.