Parineeti-Raghav Chadha | పెళ్లికి ముందు.. మ‌హాకాళేశ్వ‌రుడిని ద‌ర్శింకున్న ప‌రిణితి, రాఘ‌వ్ చ‌ద్దా

Parineeti-Raghav Chadha | బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా త్వరలో పెళ్లితో ఒకటికాబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. త్వరలో పెళ్లి పీటలెక్కనుండగా.. ఇద్దరు కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ జంట టెంపుల్‌ను సంద‌ర్శించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మ‌ధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. పింక్ క‌ల‌ర్ చీరను ప‌రిణితి ధ‌రించ‌గా, రాఘ‌వ్ ప‌సుపు వ‌ర్ణంలో ఉన్న ధోతి ధ‌రించి మెరిసిపోయారు. ఇక ఆల‌య అర్చ‌కుల స‌మ‌క్షంలో […]

  • Publish Date - August 27, 2023 / 02:28 AM IST

Parineeti-Raghav Chadha |

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా త్వరలో పెళ్లితో ఒకటికాబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. త్వరలో పెళ్లి పీటలెక్కనుండగా.. ఇద్దరు కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ జంట టెంపుల్‌ను సంద‌ర్శించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మ‌ధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. పింక్ క‌ల‌ర్ చీరను ప‌రిణితి ధ‌రించ‌గా, రాఘ‌వ్ ప‌సుపు వ‌ర్ణంలో ఉన్న ధోతి ధ‌రించి మెరిసిపోయారు.

ఇక ఆల‌య అర్చ‌కుల స‌మ‌క్షంలో ప‌రిణితి, రాఘ‌వ్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అర్చ‌కులు ఆ దంప‌తుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ప‌రిణితి, రాఘ‌వ్‌ను చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు భ‌క్తులు పోటీ ప‌డ్డారు.

ఇక మ‌హాకాళేశ్వ‌ర్ టెంపుల్‌ను విజిట్ చేసిన అనంత‌రం అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. గురుద్వారాలో వారు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్శ‌న‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను, వీడియోల‌ను ప‌రిణితి, రాఘ‌వ్ త‌మ సోష‌ల్ మీడియా గ్రూపుల‌లో షేర్ చేశారు.

పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దా సెప్టెంబర్‌ 25న పెళ్లితో ఏకం కాబోతున్నారు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా నిశ్చితార్థం మే 13న ఢిల్లీలో జరిగిన విష‌యం తెలిసిందే. కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

చాలారోజులు ప్రేమలో మునిగి తేలుతున్నారు. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకాన‌మిక్స్‌లో రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రా చదివారు. కామన్‌ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. చివరకు పెళ్లిబంధంతో ఒకటికాబోతున్నారు.

Latest News