ఉజ్జయినిలో తవ్వకాల్లో బయటపడిన శివలింగం
ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం సమీప తవ్వకాల్లో భారీ శివలింగం బయటపడింది. కుంభమేళా పనుల మధ్య ఈ ఘటన భక్తుల్లో ఆసక్తి రేపుతోంది.
విధాత : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయం సమీపంలో శుక్రవారం ఉదయం జరిపిన తవ్వకాలలో, ఒక భారీ శివలింగం బయటపడటం సంచలనంగా మారింది. 2028 సింహస్థ కుంభమేళా సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న నిర్మాణం, భూమి చదును పనులలో భాగంగా త్రవ్వకం పనులు చేస్తున్న యంత్రాలకు పానవట్టంతో కూడిన శివలింగం తాకింది. దానిని భూమిలో నుంచి వెలికి తీసి పక్కన పెట్టి తవ్వకం పనులు నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. పురావస్తు శాఖకు సమాచారం అందించగా..వారు ఆ శివలింగం ఏ కాలం నాటిదో..దాని చారిత్రక ప్రాముఖ్యత ఏమిటన్నది నిర్ధారించే పరిశోధనలు చేపట్టారు.
శివలింగం బయటపడిన విషయం తెలుసుకున్న స్థానిక పూజారులు, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివలింగానికి అభిషేకాది పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనపై మహాకాలేశ్వర ఆలయ సహాయ నిర్వాహకుడు ఆశిష్ ఫల్వాడియా స్పందించారు. సింహస్థ కుంభమేళా సన్నాహాల్లో భాగంగా చేపట్టిన పనుల్లో ఈ శివలింగం బయటపడిందని, ఆ ప్రాంతంలో మరిన్ని అవశేషాలు లభిస్తే, తదుపరి ప్రక్రియ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు (బుద్ధ పౌర్ణమి) నిజంగా ఒక పవిత్రమైన సందర్భం అని ఈ రోజున శివలింగం వెలుగుచూడటం శుభప్రదం అని చెప్పారు.
మహాకాళేశ్వర ఆలయ అర్చకుడు ఆకాష్ శర్మ త్రవ్వకాలలో బయటపడిన శివలింగానికి పూజలు నిర్వహించారు. ఇది ఎంతో విశేషమైన సందర్భం అని, ఇది బాబా మహాకాల్ (ఉజ్జయిని) కొలువైన పవిత్ర స్థలం అని గుర్తు చేశారు. ఇక్కడి ప్రతి మూలనా బాబా మహాకాల్ ఉనికి, శివుని ఆనవాళ్లు కనిపిస్తాయి అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
అమెరికా నుంచి భారత్‌కు 657 ప్రాచీన వస్తువుల అప్పగింత
వెలిమినేడులో పేలిన రియాక్టర్..కార్మికులకు గాయాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram