Pawan Kalyan | ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులు ఎంత హంగామా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమా మేకర్స్ సైతం పవన్ కళ్యాణ్ అభిమానులని ఉత్సాహపరిచేందుకు సర్ప్రైజ్ లు ఇస్తూ వస్తున్నారు.. ఈ రోజు ఉదయం ‘హరిహర వీరమల్లు` అప్ డేట్ ఇచ్చి అభిమానులకి అమితమైన ఆనందం కలిగించారు. ఆగిపోయిందనుకున్న సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. […]
Pawan Kalyan |
ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులు ఎంత హంగామా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమా మేకర్స్ సైతం పవన్ కళ్యాణ్ అభిమానులని ఉత్సాహపరిచేందుకు సర్ప్రైజ్ లు ఇస్తూ వస్తున్నారు.. ఈ రోజు ఉదయం ‘హరిహర వీరమల్లు’ అప్ డేట్ ఇచ్చి అభిమానులకి అమితమైన ఆనందం కలిగించారు.
ఆగిపోయిందనుకున్న సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఈ పోస్టర్‌తో సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అందరు భావిస్తున్నారు. ఇక పవన్ నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీతో గూస్బమ్స్ ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు సుజిత్. పవన్ కళ్యాణ్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ‘ఓజీ’లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
ఇక కొద్ది సేపటి క్రితం పవన్ కళ్యాణ్ మరో మూవీ సర్ప్రైజ్ కూడా వచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చాయి. తాజాగా కొత్త పోస్టర్ని విడుదల చేసింది యూనిట్.
ఇది మాస్ స్వాగ్ అనిపించేలా ఉండగా, ఈ పిక్‌లో పవన్ నిలువునా కత్తిపట్టుకుని నడి సెంటర్లో కూర్చిన ఉన్నాడు. ఇక పవన్ పట్టుకున్న కత్తికి రక్తం కారుతుంది, పవన్ స్టయిల్‌గా గ్లాసెస్ పెట్టుకుని, ఎర్రని బొట్టు పెట్టుకుని స్టయిల్‌గా కనిపిస్తున్నా అతని లుక్ చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ అందనుందని తెలుస్తుంది.
కొత్త లుక్‌ని పంచుకున్న టీం పోస్టర్‌కి ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అనే క్యాప్షన్ పెట్టారు. ధర్మం కోసం పవన్ కత్తిపట్టాడనే అర్థంలో ఈ కొత్త లుక్‌ని పంచుకోవడం ఫ్యాన్స్‌ని ఉత్సాహ పరుస్తుంది. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఓ రేంజ్లో బ్లాక్ బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు మరో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు.