Pawan Kalyan | ఒకరి మీద ఇష్టాన్ని అభిమానం రూపంలో చూపిస్తూ ఉంటాం. అది హీరోలపైన ఇష్టం అయితే ఆ అభిమానం ఇదిగో ఇలా మరీ విపరీతంగా ఉంటుంది. మనసులో ఉన్న ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కోలా తెలియజేస్తూ ఉంటారు. ఇక హీరోలైతే.. పెద్ద కటౌట్లు పెట్టి, పాలాభిషేకాలు, పూలమాలలతో అలంకారాలు, లేదా విగ్రహాలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక అన్నదానాలు, రక్తదానాల సంగతి సరేసరి. అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కొతీరు. అయితే పవర్ స్టార్ పవన్ […]
Pawan Kalyan |
ఒకరి మీద ఇష్టాన్ని అభిమానం రూపంలో చూపిస్తూ ఉంటాం. అది హీరోలపైన ఇష్టం అయితే ఆ అభిమానం ఇదిగో ఇలా మరీ విపరీతంగా ఉంటుంది. మనసులో ఉన్న ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కోలా తెలియజేస్తూ ఉంటారు. ఇక హీరోలైతే.. పెద్ద కటౌట్లు పెట్టి, పాలాభిషేకాలు, పూలమాలలతో అలంకారాలు, లేదా విగ్రహాలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు.
ఇక అన్నదానాలు, రక్తదానాల సంగతి సరేసరి. అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కొతీరు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు ఇందుకు కాస్త భిన్నంగా ఉంది, ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల అభిమానం చూస్తుంటే.. అరే.. భలే చేశారే అనేట్టుగా అందరినీ ఆకర్షిస్తుంది వాళ్ళ ఐడియా.
పాలాభిషేకం కాదు ఇది రజతాభిషేకం. ఆ అభిమాని అతని గుండెల్లో వెండి పవర్ స్టార్‌ని ప్రతిష్టించు కోవడమే కాదు, దాదాపు 470 కేజీల వెండి నగలతో పవన్ ముఖ చిత్రాన్ని తయారు చేశాడు. వెండి కాలి పట్టీలు, మెడలోని చైన్స్ ఇలా అన్నీ వెండి ఆభరణాలు ఓ చోట చేర్చి పవర్ స్టార్ రూపాన్ని అచ్చంగా అలాగే దిద్దాడు.
ఈ వెండి నగల విలువ దాదాపు నాలుగు కోట్లు ఉంటుందట. దీనిని పవర్ స్టార్ 52వ పుట్టినరోజు కానుకగా అందించేందుకు తయారుచేశారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ముఖచిత్రం ఉన్న వీడియోని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.
పవన్ బర్త్‌డే కానుకగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG మూవీ నుంచి అప్డేట్ రాబోతుంది. అయితే ఫస్ట్ లుక్ ఏమి లేకుండా డైరెక్ట్ టీజర్‌తో అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నారట. సెప్టెంబర్ 2న ఉదయం 10:35 నిమిషాలకు ఈ టీజర్‌ని రిలీజ్ చేయనున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 90’s బ్యాక్ డ్రాప్లో ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయినట్లుగా సమాచారం. ఈ మూవీ విడుదల ఎప్పుడనేది ఇంకా డైలమాలోనే ఉంది. మరో వైపు హోల్డ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఓ పోస్టర్ ఈ బర్త్‌డేకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా ఓ అప్డేట్ రాబోతున్నట్లుగా టాక్. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకి ఈ బర్త్‌డే ఓ మెమరబుల్ డే గా మిగిలిపోనుందనేలా ఫ్యాన్స్ మాట్లాడుకుంటుండటం విశేషం.