NTR | ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణ.. అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక హెచ్చరిక
NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ కొంతమంది వ్యక్తులు, ఫ్యాన్ గ్రూపులు సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న ఘటనలపై ఆయన కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ కొంతమంది వ్యక్తులు, ఫ్యాన్ గ్రూపులు సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న ఘటనలపై ఆయన కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆఫీస్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులు, ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.
ప్రకటనలో భాగంగా, ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్న ఎలాంటి ఫండ్ రైజింగ్ డ్రైవ్‌లు, డొనేషన్ క్యాంపెయిన్‌లు లేదా సేవా కార్యక్రమాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు అభిమాన సంఘాల పేరుతో లేదా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఇమేజ్‌ను ఉపయోగించి విరాళాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
డబ్బులు చెల్లించొద్దు..
అలాగే, ఈ తరహా కార్యక్రమాలకు ఎన్టీఆర్ వ్యక్తిగతంగా గానీ, ఆయన కార్యాలయం ద్వారా గానీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ప్రజలు, అభిమానులు భావోద్వేగాలకు లోనై డబ్బులు చెల్లించవద్దని, అధికారిక ధృవీకరణ లేని కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇకపై ఎన్టీఆర్ తరఫున ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం, విరాళాల సేకరణ లేదా అధికారిక ప్రకటన ఉంటే, అవి నేరుగా ఆయన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు లేదా కార్యాలయం ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు. మధ్యవర్తులు లేదా అనధికారిక ఫ్యాన్ పేజీల ద్వారా వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించారు.
నకిలీ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు..
ఈ ప్రకటనతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇటీవల సినీ ప్రముఖుల పేర్లను ఉపయోగించి నకిలీ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ కార్యాలయం ముందస్తు జాగ్రత్తగా ఈ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభిమానులు కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఎన్టీఆర్ అభిమానులు ఆయన కార్యాలయ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram