Pawan Kalyan | మంగళగిరికి మకాం మార్చిన పవన్

Pawan Kalyan విధాత, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలించారు. జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది, ఇతర విభాగాలు, ఫైళ్లు, కంప్యూటర్లు ఇతర సామాగ్రీనంతా మంగళగిరికి తరలించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పవన్‌కు అనుగుణంగా కార్యాలయం, ఇంటి నిర్మాణం చేశారు. ఇకపై షూటింగ్ లు ఉంటేనే పవన్ హైదరాబాద్ కు వెళ్లనున్నారు. సినిమాలపై పవన్ తో చర్చలకు కూడా ఇప్పటికే దర్శకులు మంగళగిరికి వస్తున్నారు. దీంతో ఇకమీదట మంగళగిరి కేంద్రంగానే పవన్ రాజకీయ, […]

  • By: Somu    latest    Aug 01, 2023 12:18 AM IST
Pawan Kalyan | మంగళగిరికి మకాం మార్చిన పవన్

Pawan Kalyan

విధాత, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలించారు. జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది, ఇతర విభాగాలు, ఫైళ్లు, కంప్యూటర్లు ఇతర సామాగ్రీనంతా మంగళగిరికి తరలించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పవన్‌కు అనుగుణంగా కార్యాలయం, ఇంటి నిర్మాణం చేశారు.

ఇకపై షూటింగ్ లు ఉంటేనే పవన్ హైదరాబాద్ కు వెళ్లనున్నారు. సినిమాలపై పవన్ తో చర్చలకు కూడా ఇప్పటికే దర్శకులు మంగళగిరికి వస్తున్నారు. దీంతో ఇకమీదట మంగళగిరి కేంద్రంగానే పవన్ రాజకీయ, సినీ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.