Peddapally | బీఆర్ఎస్‌కు నల్ల మనోహర్ రెడ్డి గుడ్ బై.. పెద్దపల్లి నుంచి పోటీలో ఉంటా
Peddapally | టికెట్ రాలేదని రాజీనామా విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి లో కీలకంగా వ్యవహరిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించిన మనోహర్ రెడ్డి, దశాబ్ద కాలానికి పైగా, నిత్యం ప్రజల్లో ఉంటూ, పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ కోసం పని చేస్తున్న యువతను విస్మరించి సిటింగులకు అవకాశాల పేరుతో ఏడుపదుల వయసున్న వ్యక్తికి మరోసారి టికెట్ కట్టబెట్టడం […]

Peddapally |
టికెట్ రాలేదని రాజీనామా
విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి లో కీలకంగా వ్యవహరిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించిన మనోహర్ రెడ్డి, దశాబ్ద కాలానికి పైగా, నిత్యం ప్రజల్లో ఉంటూ, పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
పార్టీ కోసం పని చేస్తున్న యువతను విస్మరించి సిటింగులకు అవకాశాల పేరుతో ఏడుపదుల వయసున్న వ్యక్తికి మరోసారి టికెట్ కట్టబెట్టడం సమంజసంగా లేదని ఆయన అన్నారు.
పార్టీలో యువకులను అణగదొక్కుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన మీడియా ప్రతినిధులకు సందేశం పంపారు. బీఆర్ఎస్ కార్యకలాపాలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా పార్టీపై బలంగా పడే అవకాశాలు కల్పిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటా..
భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసినప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని నల్ల మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. నల్ల ఫౌండేషన్ ద్వారా తాను ఎంతో మంది ప్రజలకు చేరువయ్యానని, వారి ఆశీస్సులతో రంగంలోకి దిగి విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం వచ్చే ఎన్నికల బరిలో ఉంటున్నానని, అందుకు పెద్దపల్లి ప్రజల ఆశీస్సులు కావాలని ఆయన వేడుకున్నారు.