Lunar Eclipse | నేడే అరుదైన చంద్రగ్రహణం..! ఎన్ని గంటలకు ఏర్పడబోతుందంటే..?

Lunar Eclipse | ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడబోతున్నది. ఇటీవల తొలి సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది అరుదైన చంద్రగ్రహణమని ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. నేడు ఏర్పడబోయే గ్రహణాన్ని పెనుంబ్రల్‌ చంద్రగ్రహణమని చెబుతున్నారు. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 8.44 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10.52 గంటలకు గరిష్ఠానికి చేరుకుంటుంది. శనివారం వేకువ జామున ఉదయం 1.01 గంటలకు పెనుంబ్రల్‌ చంద్రగ్రహణం ముగియనున్నది. చంద్ర గ్రహణాలు మూడు రకాలుగా ఉంటాయని […]

  • By: Vineela |    latest |    Published on : May 05, 2023 12:41 AM IST
Lunar Eclipse | నేడే అరుదైన చంద్రగ్రహణం..! ఎన్ని గంటలకు ఏర్పడబోతుందంటే..?

Lunar Eclipse | ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడబోతున్నది. ఇటీవల తొలి సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది అరుదైన చంద్రగ్రహణమని ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. నేడు ఏర్పడబోయే గ్రహణాన్ని పెనుంబ్రల్‌ చంద్రగ్రహణమని చెబుతున్నారు. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 8.44 గంటలకు ప్రారంభమవుతుంది.

రాత్రి 10.52 గంటలకు గరిష్ఠానికి చేరుకుంటుంది. శనివారం వేకువ జామున ఉదయం 1.01 గంటలకు పెనుంబ్రల్‌ చంద్రగ్రహణం ముగియనున్నది. చంద్ర గ్రహణాలు మూడు రకాలుగా ఉంటాయని ఖగోళ నిపుణులు తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్ర గ్రహణం, పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఉంటాయని పేర్కొన్నారు. చంద్రుడు భూమి బయట నీడగుండా ప్రయాణం చేస్తున్న సమయంలో పెనుంబ్రల్‌ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

అయితే, ఈ చంద్రగ్రహణం భారత్‌లో అంతటా కనిపించదని, కొద్ది ప్రాంతాల్లో కనిపిస్తుందని పేర్కొంటున్నారు. చంద్రగ్రహణంలోని కొన్ని భాగాల్లోనూ ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రం, అంటార్కిటికా ప్రాంతాలలో చూసే అవకాశం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఖగోళ దృగ్విషయం అయిన చంద్రగ్రహణం భూమి సూర్యుడు.. చంద్రుడి మధ్య తిరుగుతున్న సమయంలో చంద్రునిపై నీడపడడంతో ఏర్పడుతుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం అక్టోబర్‌ 28-29 మధ్య ఏర్పడనున్నది.