Pet Dog | హౌసింగ్ సొసైటీలో పెంపుడు కుక్క లొల్లి.. ఏం జ‌రిగింది..?

Pet Dog విధాత‌: హౌసింగ్ సొసైటీల్లోకి కుక్క‌లు పెంచుకోడానికి అనుమ‌తించాలా? అనుమ‌తిస్తే ఎలాంటి నిబంధ‌న‌లు ఉండాలి అనే చ‌ర్చ జరుగుతున్న వేళ‌.. నోయిడా (Noida) లోని ఒక హౌసింగ్ సొసైటీలో జ‌రిగిన ఒక ఘ‌ట‌న నెట్టింట్లో చ‌ర్చ‌కు దారితీసింది. లిఫ్టులో త‌న కుక్క‌ (Pet Dog) తో వెళుతున్న ఓ మ‌హిళ‌కు, మ‌రో జంట‌కు మ‌ధ్య జ‌రిగిన వాద‌న‌ను గ‌బ్బ‌ర్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌ (Twitter)లో పోస్ట్ చేశారు. వీడియోలో ఆ కుక్క‌కు మాస్క్ త‌గిలించి ఉంది […]

Pet Dog | హౌసింగ్ సొసైటీలో పెంపుడు కుక్క లొల్లి.. ఏం జ‌రిగింది..?

Pet Dog

విధాత‌: హౌసింగ్ సొసైటీల్లోకి కుక్క‌లు పెంచుకోడానికి అనుమ‌తించాలా? అనుమ‌తిస్తే ఎలాంటి నిబంధ‌న‌లు ఉండాలి అనే చ‌ర్చ జరుగుతున్న వేళ‌.. నోయిడా (Noida) లోని ఒక హౌసింగ్ సొసైటీలో జ‌రిగిన ఒక ఘ‌ట‌న నెట్టింట్లో చ‌ర్చ‌కు దారితీసింది. లిఫ్టులో త‌న కుక్క‌ (Pet Dog) తో వెళుతున్న ఓ మ‌హిళ‌కు, మ‌రో జంట‌కు మ‌ధ్య జ‌రిగిన వాద‌న‌ను గ‌బ్బ‌ర్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌ (Twitter)లో పోస్ట్ చేశారు.

వీడియోలో ఆ కుక్క‌కు మాస్క్ త‌గిలించి ఉంది కానీ దానిని మూతికి పెట్ట‌లేదు. కుక్క ఎవ‌రినీ క‌ర‌వ‌కుడా దానిని ఉప‌యోగిస్తారు. దీంతో లిఫ్ట్‌లోకి వ‌చ్చిన ఆ జంట కుక్క‌కు మాస్క్ పెట్టాల్సిందిగా ఆ మ‌హిళ‌ను కోరారు. త‌న భార్య గ‌ర్భ‌వ‌తి అని ద‌య‌చేసి కుక్క క‌రిచే ప్ర‌మాదం లేకుండా మాస్క్‌ పెట్టాల‌ని ఎంత అడిగినా ఆ కుక్కతో ఉన్న మ‌హిళ వినిపించుకోలేదు.

దీంతో ఇలాంటి మ‌హిళ‌ను ఎక్క‌డా చూడ‌లేద‌ని స‌ద‌రు వ్య‌క్తి పేర్కొన‌గా.. కుక్క‌లు నీలాంటి వాళ్ల‌నే క‌రుస్తాయ‌ని ఆమె అన‌డం వినిపించింది. ఈ వాద‌న జ‌రుగుతున్నంత సేపు పాపం ఆ కుక్క అమాయ‌కంగా దిక్కులు చూస్తూ క‌నిపించింది. ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేయ‌గా.. ఇత‌ర యూజ‌ర్లు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

హౌసింగ్ సొసైటీల్లో కుక్క‌ను పెంచుకోవాలంటే రూల్స్ త‌ప్ప‌కుండా పాటించాల్సిందేన‌ని ఒక‌రు రాయ‌గా… ఇంత గొడ‌వ‌లోనూ ఆ కుక్క భ‌లే బుద్ధిగా ఉంద‌ని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

అయితే దీనిపై స‌ద‌రు మ‌హిళ శ‌నివారం త‌న వాద‌నను వినిపిస్తూ ట్వీట్ చేశారు. ఆవిడ పేరు రిచా శ్రీనేత్‌. త‌న కుక్క‌ను లిఫ్ట్‌లో తీసుకెళ్తున్న వీడియో వైర‌ల్ అయిన‌ప్ప‌టి నుంచి అంద‌రూ బూతులు తిడుతున్నార‌ని, దీని వ‌ల్ల త‌న మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తింద‌ని ఆమె వాపోయారు.

త‌న కుక్క‌ని 50 రూపాయ‌ల కుక్క అన‌డం వ‌ల్లే కోప‌మొచ్చింద‌ని.. ఒక జీవికి డ‌బ్బుతో వెలక‌ట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. త‌న‌ను తిట్టేవారు నిజాల్ని తెలుసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. త‌న సొసైటీ వారు కూడా త‌న‌ను తిడుతున్నార‌ని చెబుతూ.. దానికి సాక్ష్యంగా సెక్యూరిటీ గార్డును చూపించారు.