ఫోన్‌ పే వాడుతున్నారా..? ‘క్రెడిట్‌’ ఫీచర్‌ను పరిచయం చేసిన కంపెనీ..!

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ యూజర్లకు తీపికబురు చెప్పింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే కంపెనీ.. తాజాగా మరో ఫీచర్‌ను యాప్‌లో జోడించింది

ఫోన్‌ పే వాడుతున్నారా..? ‘క్రెడిట్‌’ ఫీచర్‌ను పరిచయం చేసిన కంపెనీ..!

Phone Pay | ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ యూజర్లకు తీపికబురు చెప్పింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే కంపెనీ.. తాజాగా మరో ఫీచర్‌ను యాప్‌లో జోడించింది. కొత్తగా ‘క్రెడిట్‌’ సేవలను ప్రారంభించింది. ఇందులో యూజర్లు ఇకపై ఉచితంగా సిబిల్‌ స్కోరు చెక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.


క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాల చెల్లింపు సహా తదితర సర్వీసులను పొందవచ్చని చెప్పింది. యూజర్లకు తమ క్రెడిట్ బ్యూరో స్కోరును ఎలాంటి డబ్బులు చెల్లించకుండా చెక్ చేసుకోవచ్చునని.. క్రెడిట్ కార్డులు, రూపే కార్డులు, లోన్ రీపే, క్రెడిట్‌కార్డు బిల్లులను సులభంగా చెల్లించవచ్చని వివరించింది.


క్రెడిట్ బ్యూరో రిపోర్ట్‌లో మీ క్రెడిట్‌కు సంబంధించి వివరాలు సమ్మరీగా ఉంటాయి. అంటే మీరు ఎన్ని లోన్లు తీసుకున్నారు ? లోన్ రీపేమెంట్ సరిగ్గా చేశారా ? లేదా ? సహా ఇతర అన్ని వివరాలు అందులో ఉంటాయని ఫేన్‌పో ప్రకటించింది. ఈ రోజుల్లో ఆర్థిక నిర్వహణ చాలా క్లిష్టంగా మారిందని కంపెనీ పేర్కొంది.


కొత్తగా తీసుకువచ్చిన ‘క్రెడిట్‌’ ఫీచర్‌ సహాయంతో యూజర్లు ఆర్థిక విషయాలకు సంబంధించిన వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చని పేర్కొంది. క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ఏం చేయాలనే దానిపై యూజర్లకు సలహాలు, సూచనలు సైతం ఇవ్వనున్నట్లు చెప్పింది. రానున్న రోజుల్లో క్రెడిట్ ట్యాబ్‌లో మరిన్ని సేవలను తీసుకువస్తామని ప్రకటించింది.


యాప్‌లోనే లోన్లు ఇచ్చే ఫీచర్‌ను తీసుకురాబోతున్నామని, దాంతో యూజర్లు చాలా సులభంగా రుణాలు తీసుకోవచ్చని తెలిపింది. కంపెనీ సీఈవో హేమంత్‌ గాలా మాట్లాడుతూ.. క్రెడిట్ హెల్త్‌ను అర్థం చేసుకుంటేనే ఆర్థిక సాధికారత ప్రారంభమవుతుందన్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించేందుకు ‘క్రెడిట్’ ఫీచర్‌ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.


ప్రస్తుత రోజుల్లో క్రెడిట్‌ స్కోరు, సిబిల్‌ స్కోరు కీలకమయ్యాయని, లోన్లు, క్రెడిట్‌ కార్డు కావాలంటే బ్యాంకులు.. ఆయా సంస్థలు మొదట క్రెడిట్‌ స్కోరునే చూస్తుంటాయి. 750పైగానే స్కోరు ఉంటే లోన్లు, క్రెడిట్‌కార్డుల జారీ చేస్తుంటాయి. ఎక్కువగా సిబిల్‌ స్కోరు ఉంటే లోన్లపై వడ్డీ భారం తగ్గుతుంటుంది. చాలా తక్కువగా క్రెడిట్‌ స్కోరు ఉంటే కంపెనీలు లోన్లు ఇచ్చేందుకు ఆసక్తిని చూపవు. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అధికంగా వడ్డీని వసూలు చేస్తుంటాయి.