ఎరక్కపోయి.. ఇరుక్కున్న విమానం!
బీహార్‌లోని మోతీహరి వీధుల్లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. తాజాగా ఒక విమానం వంతెన కింద ఇరుక్కుపోయింది. ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున స్తంభించింది

- వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం ట్రాలీ
విధాత: బీహార్‌లోని మోతీహరి వీధుల్లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. తాజాగా ఒక విమానం వంతెన కింద ఇరుక్కుపోయింది. ట్రాఫిక్‌కు పెద్ద ఎత్తున స్తంభించింది. విమానం బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుపోయిందని ఆశ్చర్యపోతున్నారా.. స్క్రాప్ అయిన విమానం ముంబై నుంచి అసోంకు ట్రైలర్ ట్రక్కుపై తరలిస్తుండగా, పిప్రకోఠి ప్రాంతంలోని ఓవర్‌బ్రిడ్జి కింద చిక్కుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
వంతెన కింద ఇరుక్కపోయిన విమానాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. ట్రక్కు డ్రైవర్ బ్రిడ్జి ఎత్తు సరిగ్గా గమనించకపోవడంతో విమానం సగం వరకు వచ్చి ఇరుక్కుపోయినట్టు అధికారులు తెలిపారు. భారీ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వెల్డింగ్ మిషన్ కొంత వరకు కట్ చేసి లారీని సురక్షితంగా బయటకు పంపించారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నది.