PM Kisan Samman Scheme | రైతన్నలకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలకు ముమూర్తం ఖరారు.. అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడుతాయంటే..?
PM Kisan Samman Scheme | దేశానికి అన్నంపెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13 ఇన్‌స్టాల్‌మెంట్లలో రైతుల ఖాతాల్లో నాలుగు నెలలకు రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.6వేలు ఖాతాల్లో జమ చేస్తున్నది. 14వ విడుత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ […]

PM Kisan Samman Scheme | దేశానికి అన్నంపెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13 ఇన్‌స్టాల్‌మెంట్లలో రైతుల ఖాతాల్లో నాలుగు నెలలకు రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.6వేలు ఖాతాల్లో జమ చేస్తున్నది. 14వ విడుత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీన రైతుల అకౌంట్లలో కేంద్రం డబ్బులు జమ చేయనున్నది.
రూ.18వేలకోట్లు రైతుల ఖాతాలకు ప్రధాని నరేంద్ర మోదీ బదిలీ చేయనున్నారు. అయితే, రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ పూర్తిచేయకపోతే డబ్బులు జమయ్యే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం 13 విడతల్లో నగదు జమ చేసింది కేంద్రం. ఫిబ్రవరి 27, 2023న కర్ణాటక పర్యటనలో ప్రధాని నిధులు విడుదల చేశారు. అర్హులైన రైతులకు కేంద్ర సర్కార్ ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద రూ.6వేల పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తోంది. 2018, డిసెంబర్ 1 నుంచి అమలవుతోన్న ఈ పథకం ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
మరోవైపు 11వ విడత విడుదల చేసినప్పుడు మొత్తం 10 కోట్ల మంది రైతులు సాయం పొందగా.. ఆ తర్వాత 12వ విడత వచ్చే సరికి ఆ సంఖ్య 8 కోట్లకు తగ్గింది. 13వ విడతలోనూ ఈ సంఖ్య 8 కోట్లలోపే ఉండనున్నది. చాలా మంది రైతులు అనర్హులగా తేలడంతో వారిని తొలగించింది. 14వ విడత విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులు వెంటనే ఇ-కేవైసీ పూర్తి చేయాలి. సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. తమ పేరుపై ఉన్న భూముల వివరాలను సైతం వెరిఫై చేసుకోవాలి. రైతులు తమ సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. దరకాస్తు ఫారం నింపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పేరు, చిరుమానా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటివి పొరపాటు లేకుండా ఇవ్వాలి. అప్పుడే బ్యాంకు ఖాతాలోకి నగదు జమకానున్నది.
పేరు ఉందా? లేదా? ఇలా చూసుకోండి..
- లబ్ధిదారుల జాబితాలో తమ పేరు చెక్ చేసుకునేందుకు pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
- ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్‌లోకి వెళ్లి, బెనిఫిసియరీ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామం వివరాలు నమోదు చేయాలి.
- ఆ తర్వాత గెట్ రిపోర్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దాంతో రైతుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
- పేరు లేకపోతే వెంటనే వ్యవసాయాధికారిని కలిసి రిజిస్టర్ చేయించుకోవాలి. లేదంటే వెబ్‌సైట్‌లోనే నమోదు చేసుకోవచ్చు.