PM Modi | వైట్‌హౌస్‌లో.. మోదీకి బైడెన్ ఘ‌న స్వాగ‌తం

PM Modi | 7.5 కేరెట్ల వ‌జ్రం, గంధ‌పు చెక్క బాక్సును బహుమ‌తిగా ఇచ్చిన ప్ర‌ధాని విధాత‌: అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోదీకి వైట్ హౌస్‌లో ఘన స్వాగ‌తం ల‌భించింది. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌, ఆయ‌న స‌తీమ‌ణి జిల్ బైడెన్.. కారు వ‌ద్ద‌కు వ‌చ్చి మోదీని సాద‌రంగా ఆహ్వానించా రు. ఈ సంద‌ర్భంగా బైడెన్‌కు మోదీ 7.5 కేరెట్ గ్రీన్ డైమండ్‌, చేతితో చేసిన చిన్న శాండ‌ల్‌వుడ్ బాక్స్‌, ద టెన్ ప్రిన్సిప‌ల్ ఉప‌నిష‌త్స్ […]

PM Modi | వైట్‌హౌస్‌లో.. మోదీకి బైడెన్ ఘ‌న స్వాగ‌తం

PM Modi |

  • 7.5 కేరెట్ల వ‌జ్రం, గంధ‌పు చెక్క బాక్సును బహుమ‌తిగా ఇచ్చిన ప్ర‌ధాని

విధాత‌: అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోదీకి వైట్ హౌస్‌లో ఘన స్వాగ‌తం ల‌భించింది. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌, ఆయ‌న స‌తీమ‌ణి జిల్ బైడెన్.. కారు వ‌ద్ద‌కు వ‌చ్చి మోదీని సాద‌రంగా ఆహ్వానించా రు. ఈ సంద‌ర్భంగా బైడెన్‌కు మోదీ 7.5 కేరెట్ గ్రీన్ డైమండ్‌, చేతితో చేసిన చిన్న శాండ‌ల్‌వుడ్ బాక్స్‌, ద టెన్ ప్రిన్సిప‌ల్ ఉప‌నిష‌త్స్ పుస్త‌కాన్ని బ‌హుమ‌తులుగా అందించారు.

గంధ‌పు చెక్క‌తో చేసిన ఆ చిన్న‌ బాక్స్‌లో గ‌ణేశుని వెండి ప్ర‌తిమ‌, దీపాల ప్ర‌మిద‌ను ఉంచారు. ఈ పెట్టెలో ఉన్న ద‌స్ ద‌నం కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. 80 ఏళ్లు దాటిన వారు త‌మ జీవిత కాలంలో స‌హ‌స్ర చంద్ర ద‌ర్శ‌నం చేసి ఉంటార‌ని భార‌తీయులు న‌మ్ముతారు.

దానికి గుర్తుగా ఈ ద‌స్ ద‌నంను బ‌హూక‌రిస్తారు. అందుకే 81 ఏళ్ల బైడెన్‌కు మోదీ ఈ బ‌హుమ‌తిని ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం బైడెన్ దంప‌తులు మోదీకి.. ఒక వింటేజ్ అమెరిక‌న్ కెమేరా, అమెరిక‌న్ వైల్డ్ లైఫ్ ఫొటోల‌తో కూడిన పుస్త‌కం, రాబ‌ర్ట్ ఫ్రోస్ట్ సంత‌కం చేసిన క‌విత‌ల సంక‌ల‌నం మొద‌లైన వాటిని బ‌హుమతులుగా ఇచ్చారు. ఆ త‌ర్వాత వీరు ముగ్గురు భార‌తీయ సంగీత విభావ‌రిని వీక్షించారు. జాతీయ సైన్స్ ఫౌండేష‌న్ (ఎన్ ఎస్ ఎఫ్‌)లో ఇరు దేశాల‌కు సంబంధించి విద్య‌, నిపుణుల ల‌భ్య‌త అనే అంశాల‌పై చ‌ర్చించారు.

మీడియా ముందుకు మోదీ..

తొమ్మిదేళ్ల పాల‌నా కాలంలో ఎప్పుడూ మీడియా ముందుకు రాని మోదీ.. అమెరికా ప‌ర్య‌ట‌న చివ‌ర్లో మీడియా స‌మావేశానికి హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు వైట్‌హౌస్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఈ ప్రెస్ స‌మావేశంలో అమెరికా, భార‌తీయ జ‌ర్న‌లిస్టులు పాల్గొంటార‌ని తెలిపారు.

అయితే వైట్‌హౌస్‌లో అధికారికంగా జ‌రిగే మీడియా స‌మావేశాల్లో చాలా నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అతి త‌క్కువ మంది జ‌ర్న‌లిస్టుల‌కు అవ‌కాశం ఇస్తారు. వారు త‌క్కువ ప్ర‌శ్న‌ల‌నే అడ‌గాల్సి ఉంటుంది. భార‌త‌దేశంలో మైనారిటీల హ‌క్కులపై ఈ మీడియా స‌మ‌వేశంలో జ‌ర్న‌లిస్టులు ఎక్కువ‌గా దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది.

అదిరిపోయే విందు..

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఇచ్చే విందుకు నోరూరించే మెనూని సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. మోదీ శాకాహారి కావ‌డంతో ఆ మేర‌కు వైట్‌హౌస్ వ‌ర్గాలు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాయి. మొక్క‌లు, ఆకుకూర‌ల వంట‌కాల‌తో ప్ర‌సిద్ధి చెందిన షెఫ్ నీనా క‌ర్టిస్‌కు బైడెన్ దంప‌తులు ఈ మెనూ బాధ్య‌త‌ను అప్ప‌గించారు.

మెనూలో ఏమున్నాయ్‌…

స్టార్ట‌ర్స్ జాబితాలో చిరుధాన్యాల సాస్‌, గ్రిల్డ్ కార్న్ స‌లాడ్‌, పుచ్చ‌కాయ ముక్క‌లు, అవ‌కాడో సాస్‌లు ఉన్నాయి. ప్ర‌ధాన ఆహారంగా అతిథుల‌కు పోర్టోబెల్లో పుట్ట‌గొడుగుల వంట‌కం, సీ బాస్‌, లెమ‌న్ డిల్ యోగ‌ర్ట్ సాస్‌, మిల్లెట్ కేక్స్ మొద‌లైన‌వి వ‌డ్డిస్తారు. భార‌త జాతీయ ప‌క్షి నెమ‌లి థీమ్‌తో డిన్న‌ర్ హాల్‌ను అల‌కంరించారు.