PM Modi | గణతంత్ర వేడుకలకు బైడెన్‌కు మోడీ ఆహ్వానం
PM Modi | విధాత : భారత గణతంత్ర దినోత్సవం 2024 జనవరి 26వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించినట్లుగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. జీ20 సదస్సుకు ముందురోజు ఇరుదేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో బైడెన్‌ను గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా మోడీ కోరినట్లుగా గార్సెట్టి వెల్లడించారు. రెండు దేశాల సంబంధాల బలోపేతం నేపధ్యంలో బైడెన్‌ను గణతంత్ర వేడుకలకు మోడీ ఆహ్వానించారు. గతంలో 2015లో అమెరికా అధ్యక్షుడు […]

PM Modi |
విధాత : భారత గణతంత్ర దినోత్సవం 2024 జనవరి 26వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించినట్లుగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. జీ20 సదస్సుకు ముందురోజు ఇరుదేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో బైడెన్‌ను గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా మోడీ కోరినట్లుగా గార్సెట్టి వెల్లడించారు.
రెండు దేశాల సంబంధాల బలోపేతం నేపధ్యంలో బైడెన్‌ను గణతంత్ర వేడుకలకు మోడీ ఆహ్వానించారు. గతంలో 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , 2008, 2016లలో ఫ్రాన్స్ అధ్యక్షులు నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిన్ హోలాండే లు గణతంత్ర వేడులకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.