DOOR BELL | డోర్ బెల్ మోగించాడ‌ని.. యువ‌కుడిపై వృద్ధుడి కాల్పులు

DOOR BELL విధాత: ఓ యువ‌కుడు డోర్ బెల్ మోగించ‌డ‌మే పాప‌మైంది. ఇంట్లో ఉన్న వృద్ధుడు కోపంతో ఊగిపోయి, యువ‌కుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కాన్సాన్ న‌గ‌రంలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగ చూసింది వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాన్సాస్ న‌గ‌రానికి చెందిన యువ‌కుడు రాల్ఫ్ యార్ల్(16) ఓ న‌ల్ల‌జాతీయుడు. అయితే త‌న క‌వ‌ల సోద‌రుల‌ను తీసుకెళ్లేందుకు పొర‌పాటున వేరే ఇంటికి వెళ్లాడు. ఆ […]

  • By: krs    latest    Apr 18, 2023 10:17 AM IST
DOOR BELL | డోర్ బెల్ మోగించాడ‌ని.. యువ‌కుడిపై వృద్ధుడి కాల్పులు

DOOR BELL

విధాత: ఓ యువ‌కుడు డోర్ బెల్ మోగించ‌డ‌మే పాప‌మైంది. ఇంట్లో ఉన్న వృద్ధుడు కోపంతో ఊగిపోయి, యువ‌కుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కాన్సాన్ న‌గ‌రంలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగ చూసింది
వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాన్సాస్ న‌గ‌రానికి చెందిన యువ‌కుడు రాల్ఫ్ యార్ల్(16) ఓ న‌ల్ల‌జాతీయుడు.

అయితే త‌న క‌వ‌ల సోద‌రుల‌ను తీసుకెళ్లేందుకు పొర‌పాటున వేరే ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి డోర్ మూసి ఉండ‌టంతో రెండు సార్లు డోర్ బెల్ మోగించాడు. ఇంట్లో ఉన్న శ్వేత‌జాతీయుడు.. తీవ్ర ఆగ్ర‌హాంతో ఊగిపోయాడు. త‌న వ‌ద్ద ఉన్న తుపాకీతో యువ‌కుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. దీంతో యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

బాధితుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కాల్పులు జ‌రిపిన వృద్ధుడు ఆండ్రూ లెస్ట‌ర్‌(85)ను పోలీసులు అరెస్టు చేశారు. 24 గంట‌ల క‌స్ట‌డీ త‌ర్వాత ఆ వృద్ధుడిని విడుద‌ల చేశారు. దీంతో స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అయింది. నిందితుడిని అరెస్ట చేసిన క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు.

ఈ ఘ‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హారిస్ స్పందించారు. బాధిత యువ‌కుడితో బైడెన్ ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య వివ‌రాలు తెలుసుకున్నారు. పొర‌పాటున వేరే ఇంటి డోర్ బెల్ మోగిస్తే కాల్చేస్తార‌నే భ‌యంతో ఏ పిల్లాడు కూడా జీవించ‌కూడ‌ద‌ని హారిస్ ట్వీట్ చేశారు.