PM Modi | శభాష్ ఇస్రో.. చంద్రయాన్-3 స‌క్సెస్‌.. శాస్త్ర‌వేత్త‌ల‌కు మోదీ అభినంద‌న‌

PM Modi | బెంగ‌ళూరులో హ‌గ్ ఇచ్చి భుజం త‌ట్టిన ప్ర‌ధాన‌మంత్రి ఆగ‌స్టు 23 ఇక‌పై నేష‌న‌ల్ స్పేస్ డేగా ప్ర‌క‌ట‌న‌ విధాత‌: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌ (ఇస్రో) శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అభినందించారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతానికి కారణమైన ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ శనివారం బెంగళూరులో కలుసుకున్నారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌ను మోదీ కౌగిలించుకున్నారు. ఆయన వీపుపై తట్టి ప్రోత్స‌హించారు. అనంత‌రం శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. Interacting with our […]

PM Modi | శభాష్ ఇస్రో.. చంద్రయాన్-3 స‌క్సెస్‌.. శాస్త్ర‌వేత్త‌ల‌కు మోదీ అభినంద‌న‌

PM Modi |

  • బెంగ‌ళూరులో హ‌గ్ ఇచ్చి భుజం త‌ట్టిన ప్ర‌ధాన‌మంత్రి
  • ఆగ‌స్టు 23 ఇక‌పై నేష‌న‌ల్ స్పేస్ డేగా ప్ర‌క‌ట‌న‌

విధాత‌: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌ (ఇస్రో) శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అభినందించారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతానికి కారణమైన ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ శనివారం బెంగళూరులో కలుసుకున్నారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌ను మోదీ కౌగిలించుకున్నారు. ఆయన వీపుపై తట్టి ప్రోత్స‌హించారు. అనంత‌రం శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

అది శివ‌శ‌క్తి పాయింట్‌ చంద‌మామ‌ ద‌క్షిణ ధ్రువంపై మ‌నం విజ‌య‌వంతంగా అడుగుపెట్టిన ప్రాంతాన్ని ‘శివ‌శ‌క్తి’ పాయింట్‌గా ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్-3 మిషన్ స‌క్సెస్ అయిన రోజు ఆగ‌స్టు 23ను ప్ర‌ధాని మోదీ నేష‌న‌ల్ స్పేస్ డేగా ప్ర‌క‌ట‌న ప్ర‌క‌టించారు. తాను బ్రిక్స్ స‌మావేశంలో ఉన్న‌ప్ప‌టికీ మ‌న‌స్సంతా ఇక్క‌డే ఉన్న‌ద‌ని చెప్పారు.

కాగా.. తాను ఎంతో అల‌సిపోయిన‌ప్ప‌టికీ చంద్రయాన్-3 మిషన్ స‌క్సెస్ త‌న‌లో ఎక్క‌డ లేని ఆనందాన్ని నింపింద‌ని పేర్కొన్నారు. ఇలాంటి ఆనందాన్ని తాను గ‌తంలో ఎప్పుడూ అనుభ‌వించ‌లేద‌ని చెప్పారు. అనంత‌రం శాస్త్ర‌వేత్త‌ల‌తో గ్రూప్ ఫొటో దిగారు. అభినంద‌న‌, ఫొటో వీడియో సోష‌ల్ మీడియాలో ఇస్రో షేర్ చేసింది. నెటిజ‌న్ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తున్న‌ది.