Ayodhya | జనవరిలో ఆయోధ్య రామ మందిరంలో.. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన

ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం 21 లక్షల దివ్వెలతో మహా దీపోత్సవం అయోధ్యలో రాజ్‌పథ్‌ను తలపించేలా రోడ్లు రామ్‌పథ్‌ పేరిట వాటిని అభివృద్ధి చేస్తాం యుపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ వెల్లడి లక్నో: అయోధ్య (Ayodhya)లో నిర్మిస్తున్న రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వచ్చ ఏడాది జనవరిలోనే ఉంటుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. అనంతరం అయోధ్య పట్టణంలో 21 లక్షల దివ్వెలు వెలిగించి.. మహా దీపోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 9 […]

  • By: Somu    latest    Jun 15, 2023 10:48 AM IST
Ayodhya | జనవరిలో ఆయోధ్య రామ మందిరంలో.. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం
  • 21 లక్షల దివ్వెలతో మహా దీపోత్సవం
  • అయోధ్యలో రాజ్‌పథ్‌ను తలపించేలా రోడ్లు
  • రామ్‌పథ్‌ పేరిట వాటిని అభివృద్ధి చేస్తాం
  • యుపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ వెల్లడి

లక్నో: అయోధ్య (Ayodhya)లో నిర్మిస్తున్న రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వచ్చ ఏడాది జనవరిలోనే ఉంటుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు.

అనంతరం అయోధ్య పట్టణంలో 21 లక్షల దివ్వెలు వెలిగించి.. మహా దీపోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ నిర్వహిస్తున్న మహాసంపర్క్‌ కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో ఆయన గురువారం ఒక సభలో పాల్గొన్నారు.

జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆలయ ట్రస్ట్‌ ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

రానున్న నాలుగు నుంచి ఆరు నెలల్లో అయోధ్యలోని దారులన్నీ ఢిల్లీలోని రాజ్‌పథ్‌ను తలపించేలా అభివృద్ధి చేయబోతున్నామని యోగి చెప్పారు. వాటికి రామ్‌పథ్‌ అని పేరు పెట్టనున్నట్టు చెప్పారు. సుగ్రీవ ఖిల్లా నుంచి రామమందిరానికి వచ్చే దారికి భక్తి పథ్‌ అని పేరు పెట్టున్నట్టు తెలిపారు.