Modi Qualification | మోదీ లో క్వాలిఫికేషన్ దేశానికి ప్రమాదకరం.. సిసోడియా లేఖ
Modi Qualification | ప్రధాని నరేంద్ర మోదీ లో క్వాలిఫికేషన్ దేశానికి అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా( Manish Sisodia ) పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి సిసోడియా రాసిన లేఖను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ట్వీట్ చేశారు. సిసోడియా లేఖ సారాంశం.. దేశ యువత ఏదైనా సాధించాలనే ఆకాంక్షలతో ఉన్నారు. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటున్నారు. సైన్స్ […]

Modi Qualification | ప్రధాని నరేంద్ర మోదీ లో క్వాలిఫికేషన్ దేశానికి అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా( Manish Sisodia ) పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి సిసోడియా రాసిన లేఖను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ట్వీట్ చేశారు.
సిసోడియా లేఖ సారాంశం.. దేశ యువత ఏదైనా సాధించాలనే ఆకాంక్షలతో ఉన్నారు. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించాలని కలలు కంటున్నారు. కానీ ఎలాంటి విద్యార్హతలు లేని మోదీ.. యువత ఆకాంక్షలను నెరవేర్చగలడా? అని సిసోడియా ప్రశ్నించారు. గత కొన్నేండ్ల నుంచి దేశ వ్యాప్తంగా 60 వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు.
రోజురోజుకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటుంది. కానీ ప్రధాని మోదీ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మురికి కాల్వలో పైపు ఉంచి దాని ద్వారా టీ, ఆహారం తయారు చేయొచ్చని మోదీ చెబుతున్నాడు. అసలు మనం మురికి కాల్వలోని డర్టీ గ్యాస్‌తో ఆహారం తయారు చేసుకోగలమా? అని సిసోడియా ప్రశ్నించారు. అది సాధ్యం కాదన్నారు.
ఈ ప్రపంచానికి మోదీ చదువుకోలేదని తెలుసు. సైన్స్‌పై మోదీకి అవగాహన లేదన్న విషయం కూడా అందరికి తెలుసు అని సిసోడియా పేర్కొన్నారు. తాను ఏ పేపర్లపై సంతకం చేస్తున్నానో అనే విషయం కూడా మోదీకి తెల్వదు. ఏదో గుడ్డిగా తన ముందుంచే పేపర్లపై సంతకాలు చేయడమే మోదీకి తెలుసు. ఎందుకంటే అతను చదువుకోలేదు కాబట్టి అని సిసోడియా పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు.