FD క్రెడిట్ కార్డ్.. ఇది చాలా డిఫరెంట్‌ గురూ!

ప‌రిచ‌యం చేసిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ విధాత‌: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. ఓ స‌రికొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఆధారిత క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎఫ్‌డీల కోసం ఎక్స్చేంజ్‌లో క్రెడిట్ కార్డుల‌ను డిజిట‌ల్‌గా ప‌రిచ‌యం చేస్తున్న తొలి ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ పీఎన్‌బీనే కావ‌డం విశేషం. రెగ్యుల‌ర్ క్రెడిట్ కార్డుల‌కు ఇది భిన్నంగా ఉండ‌టం ఖాతాదారుల‌కు క‌లిసొచ్చే అంశం. ఈ క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు ఎన్నో ప్రోత్సాహ‌కాలు, ప్ర‌యోజ‌నాల‌నూ బ్యాంక్ […]

FD క్రెడిట్ కార్డ్.. ఇది చాలా డిఫరెంట్‌ గురూ!

ప‌రిచ‌యం చేసిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌

విధాత‌: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. ఓ స‌రికొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఆధారిత క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎఫ్‌డీల కోసం ఎక్స్చేంజ్‌లో క్రెడిట్ కార్డుల‌ను డిజిట‌ల్‌గా ప‌రిచ‌యం చేస్తున్న తొలి ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ పీఎన్‌బీనే కావ‌డం విశేషం. రెగ్యుల‌ర్ క్రెడిట్ కార్డుల‌కు ఇది భిన్నంగా ఉండ‌టం ఖాతాదారుల‌కు క‌లిసొచ్చే అంశం.

ఈ క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు ఎన్నో ప్రోత్సాహ‌కాలు, ప్ర‌యోజ‌నాల‌నూ బ్యాంక్ అందిస్తున్న‌ది. క్రెడిట్ స్కోర్ త‌క్కువ‌గా ఉన్నా.. రుణ చ‌రిత్ర బాగా లేకున్నా.. స్థిర‌మైన ఆదాయం లేకున్నా.. క్రెడిట్ కార్డును సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ఇందుకోసం బ్యాంక్‌లో ఓ ఎఫ్‌డీని చేయాల్సి ఉంటుంది. ఈ ఎఫ్‌డీ ఖాతాలో నిర్ధిష్ట మొత్తాల‌ను ఉంచాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో 80 క్రెడిట్ లిమిట్ వ‌ర్తిస్తుంది.

ప్ర‌యోజ‌నాలివే..

  • స్థిర‌మైన ఆదాయం లేకున్నా ఎఫ్‌డీ పూచీక‌త్తుతో క్రెడిట్ కార్డును సొంతం చేసుకోవ‌చ్చు
  • జాయినింగ్ ఫీజులు, వార్షిక ఫీజులేవీ ఉండ‌వు
  • ఎటువంటి డాక్యుమెంట్ల అవ‌స‌రం లేదు. ఆదాయ ధ్రువీక‌ర‌ణ‌, ఐటీ రిట‌ర్నుల స్టేట్‌మెంట్ల‌తో ప‌నిలేదు
  • బ్యాంక్ శాఖ‌ల‌ను సంప్ర‌దించ‌కుండా ఆన్‌లైన్‌లోనే మొత్తం ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవ‌చ్చు
  • యూపీఐ స‌దుపాయం, ఆక‌ర్ష‌ణీయ రివార్డులు కూడా ఉంటాయి.
  • రెగ్యుల‌ర్ క్రెడిట్ కార్డుల‌తో పోల్చితే వ‌డ్డీ లేని కాల‌ వ్య‌వ‌ధి ఎక్కువ‌
  • చేసిన ఎఫ్‌డీపైనా ఆక‌ట్టుకునే రీతిలో వ‌డ్డీ రేట్లు