Hyderabad | మహిళా ఐఏఎస్‌కు వేధింపులు.. నిందితుడిపై కేసు నమోదు
Hyderabad విధాత : ప్రభుత్వ శాఖలో డైరక్టర్‌గా కొనసాగుతున్న మహిళా ఐఏఎస్ అధికారిణికి తాను వీరాభిమానినంటూ వేధిస్తున్న శివప్రసాద్ అనే వ్యక్తిపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాధిత ఐఏఎస్ అధికారిణి కార్యాలయం అదనపు డైరక్టర్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ, తరుచు కార్యాలయానికి వస్తూ తనను కలువడానికి ప్రయత్నిస్తున్న శివప్రసాద్ ను కార్యాలయంలోనికి అనుమతించవద్దంటూ ఐఏఎస్ అధికారిణి ఆదేశాలిచ్చింది. గత […]

Hyderabad
విధాత : ప్రభుత్వ శాఖలో డైరక్టర్‌గా కొనసాగుతున్న మహిళా ఐఏఎస్ అధికారిణికి తాను వీరాభిమానినంటూ వేధిస్తున్న శివప్రసాద్ అనే వ్యక్తిపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాధిత ఐఏఎస్ అధికారిణి కార్యాలయం అదనపు డైరక్టర్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
కొంతకాలంగా ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ, తరుచు కార్యాలయానికి వస్తూ తనను కలువడానికి ప్రయత్నిస్తున్న శివప్రసాద్ ను కార్యాలయంలోనికి అనుమతించవద్దంటూ ఐఏఎస్ అధికారిణి ఆదేశాలిచ్చింది.
గత బుధవారం ఐఏఎస్ ఉంటున్న ఇంటి చిరునామా తెలుసుకుని స్వీట్ బాక్స్ ఇచ్చి వెలుతానని మేడమ్‌ను కలువాలని సిబ్బందికి చెప్పాడు. ఈ విషయాన్ని బాధిత ఐఏఎస్‌కు తెలియచేయగా, అతడిని లోనికి అనుమతించవద్దంటూ ఆదేశించింది.
దీంతో శివప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మహిళా ఐఏఎస్ పట్ల వేధింపుల ధోరణితో వ్యవహారిస్తున్న శివప్రసాద్ పట్ల చర్యలు కోరుతూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
గతంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పట్ల కూడా ఇదే తరహాలో ఓ డిప్యూటీ తహశీల్ధార్ రాత్రి వేళ ఇంటికి వెళ్లడం వివాదస్పదమైంది. ఐఏఎస్‌లకే రాష్ట్రంలో వేధింపులు ఎదురవుతున్న నేపధ్యంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటన్నదానిపై ఆందోళన వ్యక్తమవుతుంది.