West Bengal | బెంగాల్‌లో పోలింగ్‌.. ఓ బ్యాలెట్ బాక్స్‌కు నిప్పు, ఘ‌ర్ష‌ణ‌ల్లో 9 మంది మృతి

West Bengal  పశ్చిమ బెంగాల్: పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌తో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు వేదిక‌గా నిలిచిన పశ్చిమ బెంగాల్‌ లో పోలింగ్ శ‌నివారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. హైకోర్టు ఆదేశాల మేర‌కు సైన్యం భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. అయిన‌ప్ప‌టికీ శుక్ర‌వారం రాత్రి నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 మంది అల్ల‌ర్ల‌లో మ‌ర‌ణించార‌ని స‌మాచారం. వీరిలో ఐదుగురు అధికార తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు కాగా.. బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్ నుంచి ఒక్కో కార్య‌క‌ర్త, మ‌రో స్వ‌తంత్ర […]

West Bengal | బెంగాల్‌లో పోలింగ్‌.. ఓ బ్యాలెట్ బాక్స్‌కు నిప్పు, ఘ‌ర్ష‌ణ‌ల్లో 9 మంది మృతి

West Bengal

పశ్చిమ బెంగాల్: పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌తో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు వేదిక‌గా నిలిచిన పశ్చిమ బెంగాల్‌ లో పోలింగ్ శ‌నివారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. హైకోర్టు ఆదేశాల మేర‌కు సైన్యం భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది.

అయిన‌ప్ప‌టికీ శుక్ర‌వారం రాత్రి నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 మంది అల్ల‌ర్ల‌లో మ‌ర‌ణించార‌ని స‌మాచారం. వీరిలో ఐదుగురు అధికార తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు కాగా.. బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్ నుంచి ఒక్కో కార్య‌క‌ర్త, మ‌రో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఉన్నార‌ని పోలీసులు తెలిపారు.

మ‌రోవైపు కూచ్‌బిహార్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ హింసాత్మ‌క ఘ‌ట‌న‌కు వేదిక‌గా నిలిచింది. ఇక్క‌డి బ్యాలెట్ పేప‌ర్ల‌ను కొంత మంది దుండ‌గులు కాల్చి బూడిద చేశారు. ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 73,887 సీట్ల కోసం 2.06 ల‌క్ష‌ల మంది పోటీ ప‌డుతుండ‌గా.. సుమారు 5.67 కోట్ల మంది ఓటు వేయ‌నున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముంగిట క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌ట్టును తెలుసుకునే అవ‌కాశం రావ‌డంతో ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఈ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిని నిలిపాయి.

అయితే ఈ పోటీ హింస‌కు దారి తీసింది. జూన్ 8న ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు అల్ల‌ర్ల కార‌ణంగా సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద శ‌నివారం ఉదయం ఆరు గంట‌ల నుంచే పొడ‌వాటి క్యూలు దర్శ‌నమిచ్చాయి. 2018లో మెజారిటీ సీట్ల‌ను అధికార టీఎంసీ త‌న ఖాతాలో వేసుకోగా.. హింస, దొమ్మీలు చేసి గెలిచార‌ని ప్ర‌తిప‌క్ష బీజేపీ, సీపీఎం పార్టీలు విమ‌ర్శించాయి.