Polling booth | మీ పోలింగ్ బూత్‌ ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోండి..!

Polling booth : లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు (సోమవారం) రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా రేపే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఇంటింటికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తారు.

Polling booth | మీ పోలింగ్ బూత్‌ ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోండి..!

Polling booth : లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు (సోమవారం) రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా రేపే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఇంటింటికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్పులో మన పోలింగ్‌ బూత్‌ వివరాలు, సీరియల్‌ నెంబర్‌ ఉంటాయి. ఒకవేళ మీకు ఓటరు స్లిప్పు అందకపోయినా ఆందోళన చెందాల్సిన అక్కెరలేదు. ఎందుకంటే మీ పోలింగ్‌ బూత్‌ ఎక్కడ ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

ఇదీ పద్ధతి

  • స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని.. అందులోని నో యువర్ పోలింగ్ స్టేషన్ కేటగిరిలో మీ వివరాలు నింపితే మీ పోలింగ్ కేంద్రం వివరాలు తెలుస్తాయి.
  • కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ www.eci.gov.in లో నో యువర్ పోలింగ్ స్టేషన్ కేటగిరిలోకి వెళ్లి వివరాలు నమోదు చేస్తే మీ పోలింగ్ బూత్‌ వివరాలు తెలుసుకోవచ్చు.
  • అదేవిధంగా ఓటర్ హెల్ప్ నెంబర్ 1950 కి ఫోన్ చేయడం ద్వారా కూడా మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకునే అవకాశం ఉన్నది.