Panchayat Elections | పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. పోటీకి వీళ్లు కూడా అర్హులే

రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పల్లెల్లో ఎన్నికల హడావుడి పెరిగింది. తొలి విడత 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Reported by: chinna | విధాత ప్రత్యేకం | Nov 27, 2025, 8:42 pm IST
Read Time: 5 mins
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. పోటీకి వీళ్లు కూడా అర్హులే

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పల్లెల్లో ఎన్నికల హడావుడి పెరిగింది. తొలి విడత 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ఆధారంగా రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు పూర్తి చేశారు.

ఎన్నికల వ్యయం పై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ అన్ని పార్టీల నాయకులు సర్పంచ్, వార్డుల్లో తమ పార్టీ అభ్యర్ధులు గెలిచే విధంగా వ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యారు. పూర్తిగా పట్టున్న చోట ఏకగ్రీవానికి సైతంపావులు కదుపుతున్నారు. అర్ధ బలం, అంగబలం, సామాజికంగా పట్టున్న గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు పార్టీల నాయకులు ప్రాధాన్యతనిస్తున్నారు. పోటీలో నిలిచే అభ్యర్ధులు అన్ని రకాల హంగులు సమకూర్చుకుని పల్లె పంచాయతీకి సిద్ధమవుతున్నారు.

రూ.2 వేలు డిపాజిట్

21 ఏండ్ల వయస్సు ఉన్న వారు, అదే గ్రామంలో ఓటరుగా నమోదైన వారు… సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు. సర్పంచ్‌ స్థానానికి నామినేషన్ వేసేవారు (జనరల్) రూ.2వేలు డిపాటిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.వెయ్యి డిపాజిట్ కింద చెల్లించాలి. వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు (జనరల్) రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250 డిపాజిట్ చెల్లించాలి.

ఎన్నికల వ్యయ పరిమితి

ఐదు వేల జనాభాకు పైగా ఉన్న గ్రామాలలో సర్పంచ్ అభ్యర్ధి 2 లక్షల 50 వేల రూపాయల వరకు, వార్డు సభ్యులకు 50 వేల రూపాయలు, 5 వేల జనాభా తక్కువగా ఉన్న గ్రామాలలో ఒక లక్ష 50 వేల రూపాయలు, వార్డు సభ్యులు 30 వేల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

పోటీకి వీరూ అర్హులే

ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. డిసెంబర్3న బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్11న తొలి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు.

Read Also |

Panchayat Elections | సర్పంచ్ అభ్యర్థి‌ బంపర్ ఆఫర్.. గెలిపిస్తే పెళ్లిళ్లకు డీజే ఫ్రీ
Jaguar Attacks Crocodile : చిరుత..మొసలి ఫైట్..గూస్ బంప్స్..!
20-Foot Python In Bathroom : చూడకపోతే అంతే..బాత్ రూమ్ లో 20అడుగుల పైథాన్

chinna
vinaychari48@gmail.com