Poonam Pandey | నటి పూనమ్ పాండే మృతి

బాలీవుడ్ నటీ పూనమ్ పాండే(32) గుర్భాశయ క్యాన్సర్‌తో చనిపోవడం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని కల్గించింది.

  • By: Somu |    latest |    Published on : Feb 02, 2024 7:38 AM IST
Poonam Pandey | నటి పూనమ్ పాండే మృతి

Poonam Pandey | విధాత : బాలీవుడ్ నటీ పూనమ్ పాండే(32) గుర్భాశయ క్యాన్సర్‌తో చనిపోవడం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని కల్గించింది. ఆమె కొంత కాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతు చికిత్స పొందుతున్నారు. పూనమ్ పాండే తన స్వస్థలం కాన్పూర్‌లోనే తుది శ్వాస విడిచారు.


గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే చనిపోయిన ఒక రోజుకు ముందే కేంద్రం ఈ వ్యాధి నివారణకు 2024-25మధ్యంతర బడ్జెట్‌లో 9-14ఏండ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించడం గమనార్హం. దీంతో పూనమ్ పాండే మరణం మరోసారి గర్భాశయ క్యాన్సర్‌ను చర్చనీయాంశం చేసింది.