Prabhas | ప్రభాస్, రామ్ చరణ్ మల్టీస్టారర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Prabhas: ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హంగామా నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది.ఇక త్వరలో మరి కొన్ని మల్టీ స్టారర్ చిత్రాలు కూడా ప్రేక్షకులని పలకరించబోతున్నాయి. ప్రభాస్,రామ్ చరణ్ కాంబినేషన్‌లో […]

Prabhas: ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హంగామా నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సినిమాలోని నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది.ఇక త్వరలో మరి కొన్ని మల్టీ స్టారర్ చిత్రాలు కూడా ప్రేక్షకులని పలకరించబోతున్నాయి. ప్రభాస్,రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ చిత్రం రాబోతుందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుండగా, దానిపై స్పందించారు ప్రభాస్.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌ని ఈరోజు తెల్లవారుజామున విడుదల చేసి ఫ్యాన్స్‌కి ఫుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూవీకి ‘కల్కి 2898 – AD ‘ గా టైటిల్ ని మార్చామని తెలియజేశారు. ఇక గ్లింప్స్ చూస్తే ఇది హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక గ్లింప్స్ రిలీజ్ సమయంలో ప్రభాస్‌ని ఓ మీడియా ప్రతినిథి.. రామ్ చరణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారని అడిగారు. దానికి స్పందించిన ప్రభాస్.. నాకు రామ్ చరణ్ చాలా మంచి స్నేహితుడు, కచ్చితంగా త్వరలోనే మేమిద్దరం కలిసి సినిమా చేస్తామని తెలిపాడు.
ప్రభాస్‌కి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. వారిలో రామ్ చరణ్ ఒకరు. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం కి ప్రభాస్ వచ్చినప్పుడు అప్పుడు రామ్ చరణ్ వీడియో కాల్‌లో ప్రభాస్ తో ఎంత క్లోజ్ మాట్లాడాడో మనం చూసాం. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండగా, వారు కలిసి సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.
మరి వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రాన్ని ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడు, ఎవరి నిర్మాణంలో మూవీ రానుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. సలార్ , కల్కి , స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్, బుచ్చి బాబుతో ఒక సినిమా , అలాగే సుకుమార్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.