Prabhas |
విధాత: దివంగత కేంద్ర మంత్రి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవిని ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారా ? నరసాపురంలో గతంలో ఎంపీగా గెలిచి వాజపేయి కేబినెట్లో మంత్రిగా చేసిన కృష్ణంరాజు ఆ మధ్య కన్నుమూశారు. ఆయనకు నరసాపురం ప్రాంతంలో మంచి పేరు ఉంది.
ఆయన బంధు వర్గం, క్షత్రియ ఓటింగ్, నాయకులూ ఆ ప్రాంతంలో ఎక్కువే. అందుకే అక్కడ మొన్నటి ఎన్నికల్లో గెలిచినా రఘురామ కృష్ణం రాజు జగన్‌తో విభేదించి టీడీపీతో చేతులు కలిపి వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీకి దూరం అయ్యారు.
అయితే ఇప్పటికే అక్కడ గోకరాజు గంగరాజును పార్టీ ఇంచార్జ్ గా జగన్ నియమించిన జగన్ అక్కడ పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత ఆయనకు అప్పగిచారు. ఐతే ఇపుడు అక్కడ కృష్ణంరాజు ఇమేజీని వాడుకుని ఆయన భార్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.
ఈమేరకు జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీని శ్యామలాదేవి వద్దకు పంపారని అంటున్నారు. సదరు ఎంపీ వెళ్లి శ్యామలాదేవికి చెప్పి ఆలోచించుకోవాలని చెప్పారట. అయితే ఆమె ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారా అన్నది తెలీదు.
వాస్తవానికి ప్రభాస్ కు శ్యామలాదేవి సొంత తల్లి కాకున్నా ఆయన్ను ఈమె చిన్ననాటి నుంచి సొంత తల్లిలా చూసుకుంటూ ఉండేవారు. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు వద్దనే పెరిగారు. ఆయన మంచి చెడ్డలు, కెరీర్ ప్లానింగ్ అంతా కృష్ణంరాజు చూసేవారు. ఇక ప్రభాస్ కూడా శ్యామలా దేవిని తల్లిలా భావిస్తూ వస్తున్నారు.