Prakash Raj | చంద్ర‌యాన్ 3 స‌క్సెస్.. బుర‌దలో ఇరుక్కుపోయిన ప్ర‌కాశ్ రాజ్

Prakash Raj | చంద్ర‌యాన్‌3 జాబిల్లిని ముద్దాడింది. ఆ క్ష‌ణం ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ఎంత ఉద్వేగ‌భ‌రితమ‌య్యారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రోపై ప్రతి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజ‌యంతంగా దిగ‌డంతో చంద్రుడిపై అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ స‌రికొత్త చ‌రిత్ర‌నున‌మోదు చేసింది. ఇక ల్యాండింగ్ కార్యక్రమాన్ని ఇస్రో తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌డంతో కోట్లాది […]

  • Publish Date - August 24, 2023 / 07:20 AM IST

Prakash Raj |

చంద్ర‌యాన్‌3 జాబిల్లిని ముద్దాడింది. ఆ క్ష‌ణం ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ఎంత ఉద్వేగ‌భ‌రితమ‌య్యారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రోపై ప్రతి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజ‌యంతంగా దిగ‌డంతో చంద్రుడిపై అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ స‌రికొత్త చ‌రిత్ర‌నున‌మోదు చేసింది.

ఇక ల్యాండింగ్ కార్యక్రమాన్ని ఇస్రో తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌డంతో కోట్లాది మంది లైవ్ లో అ అద్భుత క్ష‌ణాలని వీక్షించారు. ఇక ఇస్రో సాధించిన ఘ‌న‌త‌పై సినీ, రాజ‌కీయ ప్రమ‌ఖుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ ఇటీవ‌ల చంద్రయాన్ 3 ప్రయోగాన్ని కించపరిచే విధంగా మూన్ నుంచి ఫస్ట్ పిక్చర్స్ అంటూ ప్రకాష్ రాజ్ కొన్ని వివాదాస్పద పోస్ట్ లు చేశాడు. చంద్ర‌యాన్‌3ని కించ‌ప‌రిచే విధంగా ప్ర‌కాశ్ రాజ్ పోస్ట్ పెట్టడంతో ఆయ‌న‌ని చాలా మంది విమ‌ర్శించారు.

ఇక చంద్రయాన్ 3 ఎప్పుడు స‌క్సెస్ అయిందో అప్పుడ అతడికి నెటిజ‌న్స్ చుక్కలు చూపిస్తూ ట్రోల్ చేసారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ తీసిన తొలి ఫోటో ఇదే అంటూ ప్రకాష్ రాజ్ బురదలో ఇరుక్కున్న‌ ఒక్కడు చిత్రంలో ఉన్న దృశ్యాన్ని పోస్ట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంద‌రు.. విక్రమ్ ల్యాండర్, రోవర్ చంద్రుడిపై నీటిని గుర్తించగా, అక్క‌డ బుర‌దలో ప్ర‌కాశ్ రాజ్ కనిపించారు అంటూ అత‌నిని దారుణంగా ఆడుకుంటున్నారు.

ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కృతం చేస్తున్న‌వారిని అభినందించాల్సింది పోయి విమ‌ర్శించ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు కూడా ప్ర‌కాశ్ రాజ్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇక సినిమాల‌లో న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ అనేక వివాదాల‌లో ఇరుక్కుంటూ ఆ పేరు చెడ‌గొట్టుకుంటున్నాడు. బీజేపీ ప్ర‌భుత్వంపై ఎప్పుడు నిప్పులు చెరుగుతూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటాడు.

Latest News