NTR | ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల

NTR | దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. President Droupadi Murmu released the commemorative coin on Late Shri NT Rama Rao on his centenary year at RBCC. The President said that Late Shri NT Rama Rao has enriched Indian cinema […]

  • By: Somu |    latest |    Published on : Aug 28, 2023 6:38 AM IST
NTR | ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల

NTR | దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు.

రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పురందేశ్వరీ మాట్లాడుతూ.. స్మారక నాణెం విడుదల ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి కొనియాడారు