Site icon vidhaatha

NTR | ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల

NTR | దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు.

రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పురందేశ్వరీ మాట్లాడుతూ.. స్మారక నాణెం విడుదల ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి కొనియాడారు

Exit mobile version