Priyamani | ప్రియా.. ఇప్పుడెందుకు ఆ విషయాలన్నీ బయటపెడుతున్నావ్?

Priyamani విధాత‌: ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందంటే ఆమె గురించి దాదాపు సినీ ఇండస్ట్రీ మరిచిపోతుంది. అలాంటిది 2017లో వివాహమైనా ఇప్పటికీ ఆ హీరోయిన్ గురించి వార్తలు నెట్టింట హడావుడి చేస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరనేనా మీ సందేహం. తనే ఒకప్పటి హీరోయిన్ ప్రియమణి. 2017లో పెళ్ళి పీటలెక్కి దాదాపు తెరమరుగైందని అనుకున్నాక.. ఢీ షోతో బుల్లి తెరమీద ప్రత్యక్షమైంది. అప్పటి నుంచి వెబ్ సిరీస్‌లలో మెరుస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో విడుదలైన […]

  • Publish Date - July 3, 2023 / 01:29 AM IST

Priyamani

విధాత‌: ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందంటే ఆమె గురించి దాదాపు సినీ ఇండస్ట్రీ మరిచిపోతుంది. అలాంటిది 2017లో వివాహమైనా ఇప్పటికీ ఆ హీరోయిన్ గురించి వార్తలు నెట్టింట హడావుడి చేస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరనేనా మీ సందేహం.

తనే ఒకప్పటి హీరోయిన్ ప్రియమణి. 2017లో పెళ్ళి పీటలెక్కి దాదాపు తెరమరుగైందని అనుకున్నాక.. ఢీ షోతో బుల్లి తెరమీద ప్రత్యక్షమైంది. అప్పటి నుంచి వెబ్ సిరీస్‌లలో మెరుస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో విడుదలైన ‘కస్టడీ’లో సీఎం పాత్రలో కనిపించింది.

అలాగే ఇప్పుడామె బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జవాన్’లోనూ మంచి పాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితంపై కొన్ని హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్‌తో ప్రియమణి పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో మారుమోగుతోంది.

ముందుగా లిప్‌లాక్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. నేను గత కొన్నేళ్ళుగా ముద్దు సీన్స్‌లో నటించడం లేదు.. దాని వెనుక కొన్ని కారణాలున్నాయని తెలిపింది. పెళ్లయిన తర్వాత.. నటించాల్సి వస్తే మాత్రం ముద్దు సీన్స్‌లో నటించకూడదనే నిర్ణయం తీసుకుందట. సినిమాకు సంబంధించి అది ఓ పాత్ర మాత్రమే అయినా కూడా వ్యక్తిగతంగా చూసినపుడు దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అటువంటి సీన్స్‌లో నటించి నా భర్తకు సమాధానం చెప్పుకోలేను. ఈ పరిస్థితి ఇరు కుటుంబాలలో కూడా ఇబ్బందిగా మారుతుంది. అలాంటి సందర్భం రాకూడదనే 2017 వివాహం అయిన తర్వాత నుంచి ఆ సీన్స్‌కు దూరంగా ఉంటున్నానంది.

ఇంకా కొందరు హీరోయిన్లు ఎదుర్కొన్నట్లే.. బాడీ షేమింగ్ విషయంలో కూడా ప్రియమణి విమర్శలు ఎదుర్కొందట. ముఖ్యంగా కలర్, హైట్ విషయంలో ప్రియమణిని చాలా మంది ఎగతాళి చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఇంకా తన భర్త ఓ ముస్లిం అని.. అతన్ని పెళ్లి చేసుకున్న విషయంలో కూడా తనపై భారీగా వ్యతిరేకత వచ్చిందని.. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనపని తను చేసుకుంటూ వెళ్లిపోయినట్లుగా ప్రియమణి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలన్నీ వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇవన్నీ.. ప్రియమణి ఇప్పుడెందుకు బయటపెడుతుందనేదే అంతుపట్టని విషయం. అవకాశాల కోసమా.. అంటే, ప్రస్తుతం ఆమె నటిగా బిజీగానే ఉంది. మరెందుకు అనేది కూడా ఆమెనే చెప్పాల్సి ఉంది.

Latest News