Pushpa Movie Style Sketch: పుష్ప సినిమా తరహా స్కెచ్..పైన అరటి గెలలు..కింద ఆవులు!
Pushpa Movie Style Sketch: పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా(Pushpa Movie) తెలుగు చలన చిత్ర రంగం సత్తాను చాటడంతో పాటు హీరో అల్లు అర్జున్ కెరీయర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ పోలీసులకు దొరక్కుండా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణ చేయడంలో వేసే ఎత్తుగడలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే నేరగాళ్లు మాత్రం పుష్ప సినిమాలో మాదిరిగా ఎర్రచందనం దుంగలు, గంజాయి, వన్యప్రాణులను తరలిస్తూ పట్టుబడుతున్న సంఘటనలు తరుచు మనం చూశాం. తాజాగా ఆవులను అక్రమంగా తరలించేందుకు పుష్ప సినిమా టెక్నిక్ ఫాలో అయి పట్టుబడ్డారు నిందితులు. డీసీఎం వాహనం(DCM Vehicle)లో పైన అరటి గెలలు, ఆకులు అమర్చి..లోపల ఆవులను పెట్టి..చెక్ పోస్టుల వద్ధ అరటి గెలల లోడ్ గా నమ్మిస్తూ అక్రమంగా ఆవులను(Illegally Transport Cows)తరలిస్తున్న ఘటన వైరల్ గా మారింది.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సంత నుంచి 16ఆవులు, 12ఎడ్లను అక్రమంగా హైదరాబాద్ లోని కబేళాలకు తరలిస్తున్నారు. అరటి గెలల లోడ్ తో అక్రమంగా ఆవులను తరలిస్తున్నారన్న సమాచారంతో చౌటుప్పల్ మండం పంతంగి టోల్ ప్లాజా వద్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. భజరంగ్ దళ్, గోరక్ష సమితి విభాగం, పోలీసులు డీసీఎంను ఆపి తనిఖీ చేశారు. డీసీఎం పై భాగంలో చెక్కలపై వేసిన అరటి గెలలు, ఆకులు తొలగించి చూడగా లోపల 28పశువులు కనిపించాయి. ఆక్రమ పశు రవాణకు నిందితులు అనుసరించిన పుష్ప సినిమా ఎత్తుగడ చూసి పోలీసులు షాక్ అయ్యారు. పట్టుకున్న పశువులను హైదరాబాద్ గోశాలకు తరలించారు. డీసీఎం డ్రైవర్ రమావత్ శరత్ కుమార్, తాళ్లపూడికి చెందిన దాసరి భగవాన్ లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే సనాతన ధర్మం, గో సంరక్షణ నినాదం వినిపించే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం నుంచి ఆవుల అక్రమ రవాణ జరుగడంతో రాజకీయంగా కూడా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram