Punganur | పుంగనూరు గలాటా.. 60 మందిపై కేసులు
Punganur | పలువురి అరెస్ట్.. టిడిపి క్యాడర్ లబోదిబో.. అన్నమయ్య జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటన ఇప్పుడు టిడిపి కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. రెచ్చ్ గొట్టి గొడవ మొదలు పెట్టిన చంద్రబాబు మెల్లగా హైదరాబాద్ చెక్కేయగా ఇటు కార్యకర్తలు మాత్రం పోలీసులకు దొరికిపోయి దెబ్బలు తింటున్నారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి నామినేటెడ్ ఇస్తాను అని లోకేష్ ఇచ్చిన హామీతో రెచ్చిపోయిన టిడిపి చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో […]

Punganur |
పలువురి అరెస్ట్.. టిడిపి క్యాడర్ లబోదిబో..
అన్నమయ్య జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటన ఇప్పుడు టిడిపి కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. రెచ్చ్ గొట్టి గొడవ మొదలు పెట్టిన చంద్రబాబు మెల్లగా హైదరాబాద్ చెక్కేయగా ఇటు కార్యకర్తలు మాత్రం పోలీసులకు దొరికిపోయి దెబ్బలు తింటున్నారు.
ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి నామినేటెడ్ ఇస్తాను అని లోకేష్ ఇచ్చిన హామీతో రెచ్చిపోయిన టిడిపి చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో హింసకు దిగారు. పోలీసులతో గొడవపడడమే కాకుండా వారి వాహనాలు సైతం తగలబెట్టారు. పెద్దిరెడ్డి ఇలాకాలో తాన సత్తా చూపాలని బాగా కోరికతో ఉన్న చంద్రబాబు ఇప్పుడు క్యాడర్ ను ఇరుకున పడేశారు.
రండ్రా .. నా కొడకల్లారా .. తన్నండి.. వేయండి అంటూ చంద్రబాబు కేకలు వేశారు. ఆయన జోరును చూసి రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు పోలీసుల మీద దాడులు చేసారు. మీకెందుకు నేను మీ వెంట ఉన్నాను అంటూ చంద్రబాబు ఇచ్చిన మాట తాలూకూ భరోసా క్యాడర్ ను మరింత ఉత్తేజితుల్ని చేయగా వాళ్ళు హుషారు ఎక్కువ పోలీసు వాహనాలు సైతం తగులబెట్టారు.
అంతేకాకుండా కొందరు కార్యకర్తలు అక్కడసెల్ఫీ వీడియోలు తీసుకుని మరీ పోలీసులకు సవాల్ విసిరారు. ఇదంతా చంద్రబాబుకు బాగానే పనికొచ్చింది. పెద్దిరెడ్డి ఊళ్లోకి వెళ్లి చంద్రబాబు బాగాదుమ్మురేపాడు అని కొందరు కార్యకర్తలు సంబరపడ్డారు. మరునాడు చంద్రబాబు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ హింసకు బాధ్యులైన దాదాపు 65 మందిని పోలీసులు గుర్తించారు. కొందర్ని అరెస్ట్ చేసారు.
మీకెందుకు.. మీకు నేను ఉన్నానని చెప్పిన చంద్రబాబు పత్తా లేడు.. కానీ పోలీసు కేసులకు భయపడిన టిడిపి కార్యకర్తలు మాత్రం మద్రాస్,. బెంగళూరు వంటి చోట్లకు పారిపోయారు. పుంగనూరు టిడిపి ఇంచార్జ్ చల్లా బాబు ఇంకా పరారీలో ఉన్నారు. చాలామంది మాత్రం పోలీసులకు దొరికారు.
వారందరి మేడా గట్టి కేసులు బుక్ చేసిన పోలీసులు తమ రీతిలో ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. దీనిమీద చంద్రబాబు స్పందిస్తూ మా కార్యకర్తలను పోలీసులు హింసిస్తున్నారు అంటూ ఒక ప్రకటన చేసారు. కానీ కార్యకర్తలు మాత్రం ఇటు పోలీసు స్టేషన్ల చుట్టూ.. ఆనక కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.