Pushpa The Rule: ‘పుష్పరాజ్’.. రూలింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కి ఇంతకంటే గొప్ప ట్రీట్ ఏముంటుంది.. పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చినట్లు.. Pushpa The Rule: ‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం, అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అర్థం’.. ఈ ఎలివేషన్ చాలదా.. ‘పుష్ప 2’ ఏ రేంజ్‌లో తెరకెక్కుతుందో తెలియడానికి. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం […]

Pushpa The Rule: ‘పుష్పరాజ్’.. రూలింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు
  • ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కి ఇంతకంటే గొప్ప ట్రీట్ ఏముంటుంది..
  • పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చినట్లు..

Pushpa The Rule: ‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేసాయంటే పులి వచ్చింది అని అర్థం, అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అర్థం’.. ఈ ఎలివేషన్ చాలదా.. ‘పుష్ప 2’ ఏ రేంజ్‌లో తెరకెక్కుతుందో తెలియడానికి. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

బాక్సాఫీస్ వద్ద మోత మోగిపోయింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ గురించి ఇక చెప్పేదేముంది. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ అసోసియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్, యాటిట్యూడ్.. అన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చాయి. దీంతో ఐకాన్ స్టార్‌కి ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసే మ్యానరిజమ్స్, చెప్పే డైలాగ్స్ క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్.. ఇలా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అనుకరించారు. దీంతో ‘పుష్ప’ క్రేజ్ ఖండంతరాలు దాటింది.