Viral Video | ఫోటో ఫ్రేమ్ వెనుకాల దూరిన కొండ‌చిలువ‌.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

Viral Video | పాములు, కొండ‌చిలువ‌లు.. ఇవి చాలా ప్ర‌మాద‌క‌రం. అలాంటి కొండ‌చిలువ‌లు, పాములు సాధార‌ణంగా అడ‌వుల్లో క‌నిపిస్తాయి. అప్పుడ‌ప్పుడు జ‌న‌వాసాల మ‌ధ్య సంచ‌రిస్తుంటాయి. ఆ మాదిరిగానే ఓ కొండచిలువ ఏకంగా ఓ ఇంట్లోకి దూరింది. ఆ ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ వెనుకాల దూరి.. అంద‌ర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. కొండ‌చిలువ త‌ల భాగాన్ని గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మై స్నేక్ క్యాచ‌ర్‌కు స‌మాచారం అందించారు. ఆ ఇంటికి […]

  • By: raj    latest    Aug 27, 2023 5:53 AM IST
Viral Video | ఫోటో ఫ్రేమ్ వెనుకాల దూరిన కొండ‌చిలువ‌.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

Viral Video | పాములు, కొండ‌చిలువ‌లు.. ఇవి చాలా ప్ర‌మాద‌క‌రం. అలాంటి కొండ‌చిలువ‌లు, పాములు సాధార‌ణంగా అడ‌వుల్లో క‌నిపిస్తాయి. అప్పుడ‌ప్పుడు జ‌న‌వాసాల మ‌ధ్య సంచ‌రిస్తుంటాయి. ఆ మాదిరిగానే ఓ కొండచిలువ ఏకంగా ఓ ఇంట్లోకి దూరింది. ఆ ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ వెనుకాల దూరి.. అంద‌ర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది.

కొండ‌చిలువ త‌ల భాగాన్ని గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మై స్నేక్ క్యాచ‌ర్‌కు స‌మాచారం అందించారు. ఆ ఇంటికి చేరుకున్న స్నేక్ క్యాచ‌ర్ డాన్ ర‌మ్‌సే నెమ్మెదిగా కొండ‌చిలువ‌ను ప‌ట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కొండ‌చిలువ‌ను ప‌ట్టేయ‌డంతో కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కొండ‌చిలువ కార్పెట్ జాతికి చెందింద‌ని స్నేక్ క్యాచ‌ర్ తెలిపాడు. ఇలాంటి కొండ‌చిలువ‌లు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూగినియా దేశాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌ని పేర్కొన్నారు. ఇవి విష‌ర‌హిత‌మ‌ని తెలిపాడు.