Mdhyapradesh | మేకను మింగిన కొండ చిలువ
Mdhyapradesh | విధాత: విశ్వం అనేక వ్యవహారాలకు వేదిక. నిత్యం సాధారణ, అసాధారణ పరిణామాలూ అనేకం చోటుచేసుకుంటాయి. వింతలు, విడ్డూరాలు నమోదవుతుంటాయి. అలాంటి నమ్మలేని షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక కొండచిలువ ఒక మేకను చంపి అమాంతం మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఖరా గ్రామంలో చోటుచేసుకున్నది. పచ్చిక బయలు మేస్తున్న మేకను భారీ కొండచిలువ ఒక్కసారి నోట కరిచింది. దానిని తన శరీరంతో చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. […]

Mdhyapradesh |
విధాత: విశ్వం అనేక వ్యవహారాలకు వేదిక. నిత్యం సాధారణ, అసాధారణ పరిణామాలూ అనేకం చోటుచేసుకుంటాయి. వింతలు, విడ్డూరాలు నమోదవుతుంటాయి. అలాంటి నమ్మలేని షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక కొండచిలువ ఒక మేకను చంపి అమాంతం మింగేసింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఖరా గ్రామంలో చోటుచేసుకున్నది. పచ్చిక బయలు మేస్తున్న మేకను భారీ కొండచిలువ ఒక్కసారి నోట కరిచింది. దానిని తన శరీరంతో చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం మెల్లగా మింగడం మొదలు పెట్టింది.
మొత్తానికి మేకను గుటుక్కుమనిపించింది. ఈ ఘటన మొత్తాన్ని స్థానికులు వీడియో తీశారు. సుమారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.