Rahul Gandhi | బీజేపీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యం: రాహుల్ గాంధీ

Rahul Gandhi | 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని గ‌ద్దె దింప‌డమే మా ల‌క్ష్యం అని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. బీహార్ రాజ‌ధాని పాట్నాలో విప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు స‌మావేశ‌మై.. బీజేపీని ఎలా ఓడించాల‌నే అంశంపై చ‌ర్చించారు. పాట్నా చేరుకున్న విప‌క్ష నేత‌లంద‌రికీ బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ త‌మ పార్టీ కార్యక‌ర్త‌ల‌తో మాట్లాడారు. ప్ర‌స్తుతం దేశంలో […]

Rahul Gandhi | బీజేపీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యం: రాహుల్ గాంధీ

Rahul Gandhi | 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని గ‌ద్దె దింప‌డమే మా ల‌క్ష్యం అని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. బీహార్ రాజ‌ధాని పాట్నాలో విప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు స‌మావేశ‌మై.. బీజేపీని ఎలా ఓడించాల‌నే అంశంపై చ‌ర్చించారు. పాట్నా చేరుకున్న విప‌క్ష నేత‌లంద‌రికీ బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ త‌మ పార్టీ కార్యక‌ర్త‌ల‌తో మాట్లాడారు. ప్ర‌స్తుతం దేశంలో సిద్ధాంత‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ జ‌రుగుతోందని తెలిపారు. కాంగ్రె్ భార‌త్ జోడో సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్, బీజేపీ భార‌త్ టోడో సిద్ధాంతినికి మ‌ధ్య యుద్ధం న‌డుస్తుంద‌న్నారు. ఈ దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు బీజేపీ విద్వేషాన్ని, హింస‌ను వ్యాప్తి చేస్తోంద‌న్నారు. కానీ మేం దాన్ని క‌ట్ట‌డి చేసేందుకు య‌త్నిస్తున్నామ‌ని రాహుల్ తెలిపారు.

అందుకే విప‌క్ష పార్టీల‌న్నీ బీహార్‌కు వ‌చ్చాయి.. విప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసి బీజేపీని త‌ప్ప‌కుండా ఓడిస్తాయ‌ని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్‌లో ఉంద‌న్నారు. బీజేపీ క‌నుమ‌రుగ‌య్యే స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ పేద‌ల పక్షాన నిల‌బడ‌టం వ‌ల్ల త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ.

ఈ భేటీలో మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సీపీఎం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీతారాం ఏచూరీ, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్ధా, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ పాల్గొన్నారు.

ఈ ఆహ్వానాల‌పై జేడీయూ వివ‌ర‌ణ ఇచ్చింది. 2024 ఎన్నిక‌ల్లో బీజేపీతో పోరాడే పార్టీల‌కే ఆహ్వానం పంపామ‌ని తెలిపింది. మాయావ‌తి, న‌వీన్ ప‌ట్నాయ‌క్, కేసీఆర్, వైఎస్ జ‌గ‌న్‌కు ఆహ్వానం పంప‌లేద‌ని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు.