Rahul Disqualification | రాహుల్‌జీ.. మా బంగ్లాలు తీసుకోండి: ఖర్గే, రేవంత్‌

బంగ్లా ఖాళీ చేస్తానన్న రాహుల్‌.. విధాత: రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంటు హౌసింగ్‌ ప్యానల్‌(Housing Pnnel) ఆదేశించడం.. గడువు పొడిగించాలని కూడా అడగకుండా ఖాళీ చేసేందుకు రాహుల్‌ సిద్ధపడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? అన్న చర్చ నడుస్తున్నది. అయితే.. రాహుల్‌కు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. రాహుల్‌ ఎక్కడ ఉండబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కాంగ్రెస్‌(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge).. ‘అవసరమైతే ఆయన తన తల్లి […]

Rahul Disqualification | రాహుల్‌జీ.. మా బంగ్లాలు తీసుకోండి: ఖర్గే, రేవంత్‌
  • బంగ్లా ఖాళీ చేస్తానన్న రాహుల్‌..

విధాత: రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంటు హౌసింగ్‌ ప్యానల్‌(Housing Pnnel) ఆదేశించడం.. గడువు పొడిగించాలని కూడా అడగకుండా ఖాళీ చేసేందుకు రాహుల్‌ సిద్ధపడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? అన్న చర్చ నడుస్తున్నది. అయితే.. రాహుల్‌కు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.

రాహుల్‌ ఎక్కడ ఉండబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కాంగ్రెస్‌(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge).. ‘అవసరమైతే ఆయన తన తల్లి సోనియా గాంధీ (Soniya Gandhi) ఇంటికి వెళతారు. లేదంటే నా బంగ్లా ఇస్తా’ అని బదులిచ్చారు.

ప్రతిపక్ష సభ్యులను అవమానించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. మరోవైపు టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) సైతం తన బంగ్లాను పార్టీ నేత కోసం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు.

ఈ మేరకు ట్విటర్‌లో మేరా ఘర్‌ ఆప్‌ కా ఘర్‌ అంటూ రాహుల్‌ను ఉద్దేశించి ఒక పోస్టు కూడా పెట్టారు. ‘రాహుల్‌ భయ్యా.. మేరా ఘర్‌ ఆప్‌కా ఘర్‌. (నా ఇల్లు నీ ఇల్లే). నా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనమంతా ఒక కుటుంబం. ఇది నీ ఇల్లు కూడా’ అని రేవంత్‌ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారం నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. గడువు పొడిగించాలని రాహుల్‌ విజ్ఞప్తి చేసుకుంటే ప్యానల్‌ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నదని ఒక అధికారి చెప్పారు. కానీ.. తగ్గేదే లే అంటున్న రాహుల్‌.. కోర్టుకే క్షమాపణ చెప్పలేదు.. ప్యానల్‌ను గడువు పొడిగించాలని కోరుతానా? అన్నట్టు.. చెప్పిన టైమ్‌ లోపలే బంగ్లా ఖాళీ చేస్తానని లేఖ రాశారు.

ఈ నేపథ్యంలోనే మల్లికార్జున్‌ ఖర్గే, రేవంత్‌రెడ్డి.. రాహుల్‌గాంధీని తమ ఇంటికి ఆహ్వానించారు. రాహుల్‌ దృష్టిలో పడేందుకు అవకాశం ఉంటుందని భావించిన పక్షంలో మరికొంత మంది కాంగ్రెస్‌ సభ్యలు సైతం ఇదే ఆఫర్‌తో ట్విట్టర్‌కు ఎక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.