Rain Effect | నేడు కోర్టులకు సెలవు
Rain Effect హైదరాబాద్, విధాత: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రేపు (21-07-2023) కోర్టులకు సెలవు ప్రకటించింది. నిరంతరం కురుస్తున్న వర్షాలకు కోర్టులకు హాజరు కావడంలో న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం రోజున సెలవు ప్రకటించాలని పలువురు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి అభ్యర్థించారు. దీంతో వారి అభ్యర్థన మేరకు శుక్రవారం రాష్ట్రంలోని కోర్టులకు న్యాయవాదులు, కక్షిదారులు […]

Rain Effect
హైదరాబాద్, విధాత: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రేపు (21-07-2023) కోర్టులకు సెలవు ప్రకటించింది. నిరంతరం కురుస్తున్న వర్షాలకు కోర్టులకు హాజరు కావడంలో న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం రోజున సెలవు ప్రకటించాలని పలువురు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి అభ్యర్థించారు.
దీంతో వారి అభ్యర్థన మేరకు శుక్రవారం రాష్ట్రంలోని కోర్టులకు న్యాయవాదులు, కక్షిదారులు కోర్టుకు హాజరు కాకపోయిన ఆయా కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు.