Rajasekhar: చిక్కుల్లో రాజ‌శేఖ‌ర్ దంప‌తులు.. రెండేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

Rajasekhar: ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు కూడా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నాడు కాని అంత‌గా అల‌రించ‌లేక‌పోతున్నాడు. అయితే రాజ‌శేఖ‌ర్‌తో పాటు ఆయ‌న భార్య చాలాసార్లు ప‌లు వివాదాల‌లో ఇరుక్కోవడం మ‌నం చూశాం. తాజాగా ప‌రువు న‌ష్టం కేసులో రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కి రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. 2011లో రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తోన్న బ్లడ్ బ్యాంక్ పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వారు త‌మ అభిమానుల నుండి […]

  • By: sn    latest    Jul 19, 2023 2:45 AM IST
Rajasekhar: చిక్కుల్లో రాజ‌శేఖ‌ర్ దంప‌తులు.. రెండేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

Rajasekhar: ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు కూడా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నాడు కాని అంత‌గా అల‌రించ‌లేక‌పోతున్నాడు. అయితే రాజ‌శేఖ‌ర్‌తో పాటు ఆయ‌న భార్య చాలాసార్లు ప‌లు వివాదాల‌లో ఇరుక్కోవడం మ‌నం చూశాం. తాజాగా ప‌రువు న‌ష్టం కేసులో రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కి రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. 2011లో రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తోన్న బ్లడ్ బ్యాంక్ పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వారు త‌మ అభిమానుల నుండి ఉచితంగా రక్తాన్ని సేక‌రించి బ‌య‌ట మార్కెట్లో ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకుంటున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యంలో చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్.. మీడియా సమావేశంలో వారు తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ 2011లో ఈ కేసు దాఖలు చేశారు.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా వారు చేసిన ఆరోపణలకు సబంధించిన వీడియోతో పాటు..మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసి కోర్టుకు సమర్పించారు అల్లు అర‌వింద్. ఎన్నో ఏళ్ల విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన నాంపల్లిలోని 17వ మెట్రోపాలిటిటన్ కోర్టు వీరిద్దరికి రెండేళ్ల‌ జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించింది. ఇక‌ ఈ కేసుపై అప్పీలుకు వెళ్లేందుకు వారికి ఛాన్స్ ఇస్తూ షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మ‌రి దీనిపై రాజ‌శేఖ‌ర్ దంపతులు ఏమైన స్పందిస్తుందో చూడాలి.

ఇక రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు వీరిద్ద‌రు వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేశారు. పెళ్ల‌య్యాక జీవిత సినిమాలు చేయ‌డం మానేసింది.జీవిత దర్శకురాలిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా ఉన్నపుడే హీరో రాజశేఖర్‌ను వివాహం చేసుకున్న జీవిత‌ ఆ తర్వాత కొన్ని సినిమాలు మాత్ర‌మే చేసి నటనకు దూరం అయ్యారు. టెక్నికల్ పరంగా ఆమె తన ప్ర‌త్యేక‌తని చాటుకుంది. రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక ఉన్నారు. ఇప్పుడు వీళ్లు కూడా హీరోయిన్లు గా అల‌రిస్తున్నారు. శివాత్మిక దొరసాని సినిమాతో ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం కాగా, ఈమె ప్ర‌స్తుతం రజినీకాంత్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ‘లాల్ సలాం’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.