Rajasthan | అల్లుడిని కిడ్నాప్ చేసి ముక్కు కోసిన అత్త‌మామ‌.. ఎందుకో తెలుసా..?

Rajasthan | అల్లుడు ఇంట్లో కాలు పెట్టాడంటే చాలు.. అత్త‌మామ‌లు రాచ‌మ‌ర్యాద‌లు చేస్తుంటారు. అల్లుడికి ఏ లోటు రాకుండా అన్ని ర‌కాల సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంటారు. కానీ ఈ అల్లుడు మాత్రం వాటికి నోచుకోలేదు. అత‌న్ని కిడ్నాప్ చేసి ముక్కు కోసేశారు( Nose Cut ) అత్త‌మామ‌లు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌( Rajasthan )లోని నాగౌర్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. అజ్మీర్‌( Ajmer )కు చెందిన ఓ యువ‌కుడు నాగౌర్ జిల్లాకు చెందిన ఓ యువ‌తిని […]

Rajasthan | అల్లుడిని కిడ్నాప్ చేసి ముక్కు కోసిన అత్త‌మామ‌.. ఎందుకో తెలుసా..?

Rajasthan | అల్లుడు ఇంట్లో కాలు పెట్టాడంటే చాలు.. అత్త‌మామ‌లు రాచ‌మ‌ర్యాద‌లు చేస్తుంటారు. అల్లుడికి ఏ లోటు రాకుండా అన్ని ర‌కాల సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంటారు. కానీ ఈ అల్లుడు మాత్రం వాటికి నోచుకోలేదు. అత‌న్ని కిడ్నాప్ చేసి ముక్కు కోసేశారు( Nose Cut ) అత్త‌మామ‌లు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌( Rajasthan )లోని నాగౌర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అజ్మీర్‌( Ajmer )కు చెందిన ఓ యువ‌కుడు నాగౌర్ జిల్లాకు చెందిన ఓ యువ‌తిని ప్రేమించి పెళ్లి( Love Marriage ) చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులిద్ద‌రూ అజ్మీర్‌లోనే కాపురం పెట్టారు. మార్చి 18న అల్లుడికి ఇంటికి అత్త‌మామ‌లు వెళ్లారు. అల్లుడిని కిడ్నాప్ చేసి నాగౌర్ జిల్లాలోని త‌మ సొంతూరుకు తీసుకొచ్చారు.

అక్క‌డ అత్త‌మామ‌, బావ‌మ‌రిది క‌లిసి అల్లుడి ముక్కు కోసేశారు. దీంతో బాధిత వ్య‌క్తి అజ్మీర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత్త‌మామ‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌మ బిడ్డ‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం త‌మ‌కు ఇష్టం లేద‌ని, అందుకే అత‌డి ముక్కు కోసేశామ‌ని వారు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించారు.