Rajasthan | రాజ‌స్థాన్‌లో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం.. సినిమా త‌ర‌హాలో వ్యాపారిని కాల్చి చంపిన దుండ‌గులు

Rajasthan మ‌ద్యం వ్యాపారిని కాల్చిచంపిన దుండ‌గులు కారుతో జీపును అడ్డ‌గించి.. సినిమా త‌ర‌హా.. స‌మీప సీసీటీవీలో ఘ‌ట‌న రికార్డు.. కేసు న‌మోదు విధాత‌: రాజ‌స్థాన్‌లో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటుచేసుకున్న‌ది. ముగ్గురు అగంత‌కులు లిక్క‌ర్ వ్యాపారిని ద‌గ్గ‌రి నుంచి కాల్చి చంపారు. కారుతో వ‌చ్చి జీపును అడ్డ‌గించి అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపారు. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న‌ స్థానికుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసింది. ఈ కాల్పుల ఘ‌ట‌న స‌మీపంలోని సీసీటీవీలో రికార్డ‌యింది. రాజస్థాన్‌లోని జ‌లోర్ […]

Rajasthan | రాజ‌స్థాన్‌లో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం.. సినిమా త‌ర‌హాలో వ్యాపారిని కాల్చి చంపిన దుండ‌గులు

Rajasthan

  • మ‌ద్యం వ్యాపారిని కాల్చిచంపిన దుండ‌గులు
  • కారుతో జీపును అడ్డ‌గించి.. సినిమా త‌ర‌హా..
  • స‌మీప సీసీటీవీలో ఘ‌ట‌న రికార్డు.. కేసు న‌మోదు

విధాత‌: రాజ‌స్థాన్‌లో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటుచేసుకున్న‌ది. ముగ్గురు అగంత‌కులు లిక్క‌ర్ వ్యాపారిని ద‌గ్గ‌రి నుంచి కాల్చి చంపారు. కారుతో వ‌చ్చి జీపును అడ్డ‌గించి అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపారు. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న‌ స్థానికుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసింది. ఈ కాల్పుల ఘ‌ట‌న స‌మీపంలోని సీసీటీవీలో రికార్డ‌యింది.

రాజస్థాన్‌లోని జ‌లోర్ జిల్లా సంచోర్ ప‌ట్ట‌ణంలో మంగ‌ళ‌వారం మ‌ద్యం వ్యాపారి ల‌క్ష్మ‌ణ్‌దేవాసి త‌న బ్లాక్ జీపులో వెళ్తుండ‌గా, ఒక తెల్ల‌టికారు వారి కారును అడ్డ‌గించింది. కారులో నుంచి తుపాకుల‌తో దిగిన ముగ్గురు అగంత‌కులు జీపు ముందు సీట్లో కూర్చున్న ల‌క్ష్మ‌ణ్‌దేవాసిపై ద‌గ్గ‌రి నుంచి కాల్పులు జ‌రిపారు. సినిమా త‌ర‌హాలో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ముగ్గురు కాల్పులు జ‌రిపారు.

అనంత‌రం క్ష‌ణాల్లోనే వ‌చ్చిన కారులోనే ప‌రార‌య్యారు. సినిమా త‌ర‌హాలో జ‌రిగిన‌ ఘ‌ట‌న సమీపంలోని సీసీటీవీలో రికార్డ‌యింది. మద్యం వ్యాపారితోపాటు కారులో ఉన్న ఓ వ్యక్తి వాహనాన్నిరివర్స్‌ చేసి ద‌వాఖాన‌కు తరలించారు. అయితే, అప్ప‌టికే ల‌క్ష్మ‌ణ్ దేవాసి చ‌నిపోయిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.