తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో శ్రీరామ అక్షింతల వితరణ
అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భారతదేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అక్షింతలను సింగపూర్‌లోని భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) అందజేసింది.

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం
అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భారతదేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అక్షింతలను సింగపూర్‌లోని భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) అందజేసింది. అయోధ్యలో కార్యక్రమం జరుగుతున్న రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించా. జనవరి 22న సింగపూర్‌లోని చాంగి విలేజ్‌లో ఉన్న శ్రీ రాముని గుడిలో రాముల వారి సన్నిధిలో ఎంతో కన్నుల పండుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పవిత్ర కార్యాన్ని ఇక్కడి దేవాలయాల్లో నిర్వహించే అవకాశం దక్కడం తమకు దక్కిన పుణ్యం అని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర కార్యం లో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామ స్మరణ చేస్తూ పాల్గొని ప్రసాదంతో పాటు అక్షింతలు స్వీకరించి శ్రీరాముని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా జై శ్రీ రామ్ నామస్వరణతో మారుమ్రోగింది.

ఈ వేడుకల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు శ్రీ రామును సేవలో భక్తి తో పరవశించి పోయారు. ఈ మహోత్సవంలో సుమారు 1000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ స్థాపన నుండి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా, లాభాపేక్ష లేకుండా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీని కొనియాడారు.

ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగు వారితో పాటు ఇతర భక్తులు పెద్ద ఎత్తున శ్రీరాముని సేవలో పాల్గొని విజయవంతంగా జరుగుటకు తోడ్పడిన, సహాయ సహకారాలు అందించిన దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్‌ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుండి ఈ పవిత్ర అక్షింతలను సింగపూర్ తేవడంలో ముఖ్య భూమిక పోషించిన గోనె నరేందర్ రెడ్డి గారికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీ రామర్ ఆలయ అధికారులు మాట్లాడుతూ ఈ పుణ్య కార్యక్రమం ఈ ఆలయం లో నిర్వహించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు.
