Ayodhya Ram Mandir | ఇలా.. అయోధ్య‌పుర‌ములో! శ‌ర‌వేగంగా.. రామ‌మందిర ప‌నులు

Ayodhya Ram Mandir తాజా ఛాయాచిత్రాలను విడుదల చేసిన‌ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం విధాత‌: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. నిర్మాణ ప‌నుల‌కు సంబంధించిన తాజా ఫొటోల‌ను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో విడుద‌ల‌చేసింది. రామ మందిర నిర్మాణ ప‌నుల‌కు వ‌చ్చే జ‌న‌వ‌రిలోగా పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంతో వేగంగా చేప‌డుతున్నారు. 2024 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామ‌ని ఇప్ప‌టికే కేంద్ర హోం మంత్రి […]

  • By: Somu    latest    Jul 21, 2023 10:44 AM IST
Ayodhya Ram Mandir | ఇలా.. అయోధ్య‌పుర‌ములో! శ‌ర‌వేగంగా.. రామ‌మందిర ప‌నులు

Ayodhya Ram Mandir

  • తాజా ఛాయాచిత్రాలను విడుదల చేసిన‌ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం

విధాత‌: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. నిర్మాణ ప‌నుల‌కు సంబంధించిన తాజా ఫొటోల‌ను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో విడుద‌ల‌చేసింది.

రామ మందిర నిర్మాణ ప‌నుల‌కు వ‌చ్చే జ‌న‌వ‌రిలోగా పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంతో వేగంగా చేప‌డుతున్నారు. 2024 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామ‌ని ఇప్ప‌టికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌క‌టించారు.

ఆలయ అధికారులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఐదు మండపాల గోపురం పరిమాణం 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల పొడవు, ప్రాంగణం ఎత్తు 69 అడుగుల నుంచి 111 అడుగుల వరకు ఉంటుంది. ఈ ఆలయం సుమారు 380 అడుగుల పొడవు. 250 అడుగుల వెడల్పు, ప్రాంగణం నుంచి 161 అడుగుల ఎత్తులో ఉండ‌నున్న‌ది.