High Court | చివరి అభ్యర్థి వరకు ర్యాంకులు, మార్కులు తెలియజేయాలి: హైకోర్టు
High Court | హైదరాబాద్, విధాత: నీట్ పీజీ-2023 అడ్మిషన్‌లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందినా.. చివరిగా అడ్మిట్ అయిన అభ్యర్థి సాధించిన మార్కులు, ర్యాంక్ వివరాలు తెలియజేయాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో సూచించినా.. జాతీయ మెడకిల్ కమిషన్ జారీ చేసిన నీట్ పీజీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌లో ఎక్కడా ఆ ఆంశాన్ని పేర్కొనలేదని హైదరాబాద్‌కు చెందిన కొయ్యల రూత్ […]

High Court |
హైదరాబాద్, విధాత: నీట్ పీజీ-2023 అడ్మిషన్‌లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందినా.. చివరిగా అడ్మిట్ అయిన అభ్యర్థి సాధించిన మార్కులు, ర్యాంక్ వివరాలు తెలియజేయాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో సూచించినా.. జాతీయ మెడకిల్ కమిషన్ జారీ చేసిన నీట్ పీజీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌లో ఎక్కడా ఆ ఆంశాన్ని పేర్కొనలేదని హైదరాబాద్‌కు చెందిన కొయ్యల రూత్ జాన్ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నీట్ పీజీ అడ్మిషన్‌లో అర్హత సాధించినా చివరి అభ్యర్థి ర్యాంకులు, మార్కులను తెలుసుకుని రావాలని ఎన్‌ఎంసీ న్యాయవాదిని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.