Teenmar Mallanna : టీఆర్పీ గుర్తుపై హైకోర్టుకు తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) గుర్తింపు, గుర్తుపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ఆదేశించింది.

Teenmar Mallanna : టీఆర్పీ గుర్తుపై హైకోర్టుకు తీన్మార్ మల్లన్న

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) గుర్తింపు, గుర్తుపై ఆ పార్టీ వ్యవస్థాకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని కోరారు.
తీన్మార్ మల్లన్న పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

బీసీలకు రాజ్యాధికారం, ఆత్మగౌరవం నినాదంతో తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు. పార్టీ జెండాను కార్మిక, కర్షక వర్గానికి చిహ్నంగా ఎరుపు, ఆకుపచ్చ రంగుల సమ్మెళనంతో ఆవిష్కరించారు. జెండాలో కార్మిక చక్రం, రెండు అలీవ్ ఆకులు, బిగించిన పిడికిలి ముద్రించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు తీన్మార్ మల్లన్నకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ గుర్తు కేటాయిస్తారన్నది తర్వలోనే తేలనుంది.