Rashi Phalalu | Today Horoscope in Telugu.. ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
Rashi Phalalu | దిన ఫలాలు (చంద్రచారము ఆధారంగా) తేదీ : 17.06.2023; చంద్రచారము ఉదయం 5.14 గంటల వరకు వృషభరాశి, తదుపరి మిథునరాశి. మేష రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 2వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, సమస్యల కారణంగా మానసిక వేదన, దిగులు ఉంటాయి. తదుపరి చంద్రుడు 3వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల […]

Rashi Phalalu | దిన ఫలాలు (చంద్రచారము ఆధారంగా)
తేదీ : 17.06.2023; చంద్రచారము ఉదయం 5.14 గంటల వరకు వృషభరాశి, తదుపరి మిథునరాశి.
మేష రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 2వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, సమస్యల కారణంగా మానసిక వేదన, దిగులు ఉంటాయి. తదుపరి చంద్రుడు 3వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృషభ రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. తదుపరి 2వ ఇంటకు మారుతున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మనసు వేదనతో, దిగులుతో నిండి ఉంటుంది.
మిథున రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 12వ ఇంట ఉంటున్నందున వృత్తిపరమైన అంశాల్లో చిన్నపాటి ఇబ్బందుల కారణంగా అనుకోని ఖర్చులు జరిగే అవకాశం కనిపిస్తున్నది. తదుపరి 1వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు నెలకొంటాయి.
కర్కాటక రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 11వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. తదుపరి 12వ ఇంటకు మారుతున్నందున ఆర్థికంగా కొంత నష్టపోతారు. స్వల్ప సమస్యలు, టెన్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నది.
సింహ రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 10వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో గణనీయమైన మార్పులు తెస్తుంది. తదుపరి 11వ ఇంటికి మారుతున్నందున లాభదాయక పరిస్థితులు కొనసాగుతాయి.
కన్యా రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 9వ ఇంట ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యల కారణంగా మనసు వేదనతో నిండి ఉంటుంది. తదుపరి 10వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో గణనీయమైన మార్పు తెస్తుంది.
తులా రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 8వ ఇంట ఉంటున్నందున ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నది. దాని వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. తదుపరి 9వ ఇంటకు మారుతున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, ఇబ్బందుల కారణంగా మనసు వేదనతో, విచారంతో ఉంటుంది.
వృశ్చిక రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 7వ ఇంట ఉంటున్నందున గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో మెరుగుదలను ఆశించవచ్చు. తదుపరి 8వ ఇంటకు మారుతున్నందున కొన్ని ఆర్థికనష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
ధనూ రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 6వ ఇంట ఉంటున్నందున ఆర్థిక విషయాలతోపాటు గృహ, ఆరోగ్య విషయాల్లోనూ గణనీయమైన మార్పు కనిపిస్తుంది. తదుపరి 7వ ఇంటకు మారుతున్నందున సానుకూల పరిస్థితులు కొనసాగుతాయి.
మకర రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 5వ కొన్ని నష్టాలు, కుటుంబ పరమైన సమస్యలతో మనసు వేదనతో నిండి ఉంటుంది. తదుపరి 6వ ఇంటకు మారుతున్నందున ఆరోగ్యం, వృత్తి, వ్యాపార రంగాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.
కుంభ రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 4వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలు, టెన్షన్లతో వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నది. తదుపరి 5వ ఇంటకు మారుతున్నందన స్వల్ప నష్టాలు, సమస్యలు, టెన్షన్లతో మనో వేదన ఉంటుంది.
మీన రాశి: చంద్రుడు ఉదయం 5.14 గంటల వరకు 3వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో అంతా సానుకూలంగా ఉంటుంది. తదుపరి 4వ ఇంటకు మారుతున్నందున వృత్తిపరంగా స్వల్ప సమస్యలతో వివాదాలు, విభేదాలు నెలకొనే అవకాశం ఉన్నది.