Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకి ఇప్పుడు తెలుగులోనే కాదు తమిళం,హిందీ భాషలలోను అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ పలు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం బన్నీతో కలిసి పుష్ప 2 చిత్రం చేస్తుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగానే పెట్టుకుంది. అయితే తాజాగా రష్మిక తన అసిస్టెంట్ పెళ్లిలో చీరకట్టుతో తళుక్కున మెరిసింది. ఎప్పుడు […]
Rashmika |
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకి ఇప్పుడు తెలుగులోనే కాదు తమిళం,హిందీ భాషలలోను అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ పలు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు.
ప్రస్తుతం బన్నీతో కలిసి పుష్ప 2 చిత్రం చేస్తుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగానే పెట్టుకుంది. అయితే తాజాగా రష్మిక తన అసిస్టెంట్ పెళ్లిలో చీరకట్టుతో తళుక్కున మెరిసింది. ఎప్పుడు పొట్టి దుస్తులలో కనిపించే రష్మిక తాజాగా ఆరేంజ్ శారీలో మెరిసి అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
రష్మిక పర్సనల్ అసిస్టెంట్ సాయి పెళ్లి హైదరాబాద్‌లో జరగగా, తన అసిస్టెంట్ వివాహానికి స్వయంగా వచ్చి నూతన వధూవరులని ఆశీర్వదించింది రష్మిక. పెళ్లిలో హంగామా అంతా రష్మికదే అన్నట్టుగా ఉంది. రష్మిక తన పెళ్లికి రావడంతో సాయి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
రష్మిక కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకోగా, ఆ సమయంలో వారిని అక్షింతలతో ఆశీర్వదించింది రష్మిక. ఇక అనంతరం నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. పెళ్లిలో రష్మిక ఆరెంజ్ కలర్ శారీతోపాటు స్లీవ్ లెస్ బ్లౌజ్లో దర్శనమిచ్చింది. చీరలో ఎంతో క్యూట్‌గా ఉండడంతో ప్రతి ఒక్కరి దృష్టి ఆమెపైనే ఉంది.
ఇక రష్మిక మందన్నా ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప2 చిత్రం చేస్తుండగా, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ‘పుష్ప’ మొదటి భాగంకి రెండు జాతీయ అవార్డులను సొంతం చేకున్న విషయం తెలిసిందే. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు రాగా, సాంగ్స్ విభాగంలో దేవిశ్రీ ప్రసాద్‌కి నేషనల్ అవార్డు దక్కింది.
ఈ క్రమంలో పుష్ప2ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్‌లో రష్మిక పాత్ర మధ్యలోనే ముగియనుందని టాక్. ఇక హిందీలో ‘యానిమల్’ చిత్రంలో చేస్తున్న రష్మిక.. తెలుగులో ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. అలానే ధనుష్‌తో ఢీ51 మూవీ చేస్తుంది.